ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @7AM - Telangana top news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten telugu news
టాప్​టెన్​ న్యూస్​ @7AM
author img

By

Published : Feb 22, 2022, 6:58 AM IST

  • దేశం బాగుకోసమే జాతీయ రాజకీయాల్లోకి

భారతదేశం బాగుకోసమే తాను దేశ రాజకీయాల్లోకి వెళుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. బంగారు భారత్‌ను తయారు చేసుకుందామని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో తెరాస నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. దేశ రాజకీయాల్లోనూ ప్రముఖపాత్ర పోషించాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

  • గురుకులాల్లో భారీగా పోస్టులు

గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో దాదాపు 10 వేల పోస్టులు భర్తీ అయ్యే అవకాశాలున్నాయి. కొత్తగా గుర్తించిన పోస్టులతో పాటు గతంలో మంజూరైన వాటి భర్తీకి నూతన జోనల్‌ విధానం మేరకు అనుమతుల కోసం ప్రభుత్వానికి సొసైటీలు ప్రతిపాదనలు పంపించాయి. ఇవి భర్తీ అయితే.. పోలీస్‌శాఖ తరువాత అత్యధిక పోస్టులు గురుకులాల్లోనే ఉంటాయని సమాచారం.

  • 15 పులులను దత్తత తీసుకున్న ఎస్బీఐ

Tigers adoption: నెహ్రూ జూలాజికల్‌ పార్కులోని 15 పులులను ఎస్బీఐ దత్తత తీసుకుంది. జూలోని 15 పులులకు ఏడాది పాటు ఆహారానికి అయ్యే 15 లక్షల చెక్కును ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ శోభకు సీజీఎం జింగ్రాన్‌ అందజేశారు.

  • గౌతమ్‌ రెడ్డి చివరి మాటలు

నొప్పి ఏదైనా.. భరించే వాళ్లకు అది బాధ. కానీ వాళ్లను చూస్తున్న ఆత్మీయులకు మాత్రం నరకం! గుండెపోటులాంటి తీవ్రమైన ప్రాణాంతక పరిస్థితులు.. మాటల్లో చెప్పతరం కానివి! కళ్ల ముందు వాళ్లు పడుతున్న అవస్థను చూసి తట్టుకోలేక.. చేయడానికి ఏమీలేక.. మిన్ను విరిగి మీదపడుతున్నట్టుగా.. కాళ్ల కింది భూమి కదిలిపోతున్నట్టుగా గుండెల్లో భయం విస్పోటనమైన వేళ.. మనవాళ్ల హృదయం ఎంతలా తల్లడిల్లిపోతుందో తెలుసా? మేకపాటి గౌతమ్‌ రెడ్డి గుండెల్లో నొప్పితో తల్లడిల్లిపోతున్న ఆయన సతీమణి.. సరిగ్గా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు!

  • సత్యాగ్రహం ఆమె పుణ్యమే

ఇంట్లోంచి అడుగు బయట పెట్టాలంటే నిర్బంధం... అడగకుండా ఎటు వెళ్లావనే గద్దింపు... ఎటు వెళ్లినా అనుమతి తీసుకోవాలనే షరతు... ఇలా అహంకార మోహన్‌దాస్‌ నుంచి అసాధారణ మహాత్ముడయ్యే దాకా.. ఎన్నో అవతారాల్ని చూసి, భరించి, సహించి.. అర్థం చేసుకొని ఎన్నో త్యాగాలతో తన వెనకాల ధైర్యంగా నిలబడిన ఆమె నుంచి ఆయన నేర్చుకున్నదే సత్యాగ్రహం! అలా నేర్చుకున్న శిష్యుడు గాంధీజీ... మౌనంగా నేర్పిన గురూజీ కస్తూర్బా!

  • అనతికాలంలోనే మల్లన్నసాగర్‌ సాకారం

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన భారీ జలాశయం మల్లన్నసాగర్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే రిజర్వాయర్‌లో 10.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. భూసేకరణ, పునరావాసం సమస్యలను అధిగమించి... తక్కువకాలంలోనే మల్లన్నసాగర్‌ను ప్రభుత్వం సాకారం చేసింది.

  • మన సమాచారం ఎవరికో చేరుతోంది

తమ వ్యక్తిగత వివరాలు, ఆర్థిక సమాచారం ఇతరులకు చేరేందుకు టెలికాం సంస్థలు, బ్యాంకులే కారణమ'ని వినియోగదారులు భావిస్తున్నట్లు లోకల్‌సర్కిల్స్‌ సర్వేలో వెల్లడైంది. దేశ వ్యాపంగా 337 జిల్లాల నుంచి 20,500 మందిని సర్వే చేసినట్లు సంస్థ పేర్కొంది.

  • రష్యా చర్యపై ప్రపంచదేశాలు ఆగ్రహం

ఉక్రెయిన్‌లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలను రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించడంపై పలు దేశాలు మండిపడ్డాయి. ఈ చర్యతో రష్యా అంతర్జాతీయ కట్టుబాట్లను ఉల్లంఘించిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రష్యాపై మరిన్ని ఆంక్షలకు ఆదేశించినట్లు.. శ్వేతసౌధం వెల్లడించింది.

  • టీమ్​ఇండియా స్టార్​ క్రికెటర్​ రిటైర్మెంట్

భారత జట్టు మహిళా క్రికెటర్​ వీఆర్​ వనిత అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించింది. 31ఏళ్ల వనిత తన నిర్ణయాన్ని ట్విట్టర్​ ద్వారా తెలిపింది. క్రికెట్​లోని అన్ని ఫార్మాట్లకు గుడ్​బై చెప్పినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో టీమ్​ ఇండియాతో తన ప్రయాణం గురించి ట్వీట్ చేసింది. ఈ జర్నీలో తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది.

  • చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ఆ భావన కలిగింది

'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా విభిన్నంగా ఉంటుందని, సమస్యలన్నీ మర్చిపోయి హాయిగా నవ్వుకునేలా చేస్తుందని అన్నారు నటి రాధిక. శర్వానంద్‌, రష్మిక అద్భుతంగా నటించారని ప్రశంసించారు. ఈ చిత్రం విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మేకింగ్‌ పరంగా అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులొచ్చాయని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.