ETV Bharat / state

TOP TEN NEWS: టాప్‌టెన్ న్యూస్@7PM - Telangana top ten news

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS
TOP TEN NEWS
author img

By

Published : Feb 22, 2022, 7:00 PM IST

  • దండేసి దండం పెడతాం

TRS on Bayyaram Steel Plant : విభజన హామీల అమలు విషయంలో భాజపా, అధికార తెరాస మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. బయ్యారం ఉక్కుకర్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై తెరాస లోక్​సభపక్ష నేత నామ నాగేశ్వరరావు మండిపడ్డారు. పార్లమెంట్‌ సాక్షిగా విభజనచట్టంలో పేర్కొన్న బయ్యారం ఉక్కుకర్మాగారం హామీ నుంచి కేంద్రం తప్పించుకుంటోందని మండిపడ్డారు.

  • సీపీఆర్‌ చేస్తే ప్రాణం పదిలమే

CPR Technique: శరీరానికి రక్తాన్ని ప్రసరణ చేస్తూ... మనిషి ప్రాణాలను కాపాడుకోవటంలో గుండెది కీలకపాత్ర. ఇటీవల కార్డియాక్ అరెస్టు కేసుల సంఖ్య పెరుగుతోంది. క్షణాల్లోనే గుండె పనిచేయటం ఆగిపోయి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. గుండె కొట్టుకోవటం ఆగిపోయిన వారికి వెంటనే సీపీఆర్ చేస్తే ప్రాణాలు కాపాడొచ్చని వైద్యులు చెబుతున్నారు.

  • ఆర్టీసీ బస్సులో మంటలు

RTC BUS FIRE: బస్సు డ్రైవర్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన సికింద్రాబాద్​లోని లాలాపేట్​లో జరిగింది.

  • డ్రైవర్​ను బెదిరిస్తారు

Lorry Tyres Theft Gang Arrested: టైర్ల లోడు కంటైనర్లను దారి మళ్లించి రూ. లక్షల్లో దోపిడీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. డ్రైవర్​ను తుపాకితో బెదిరించి లారీ టైర్లను వారికి సంబంధించిన గోదాములకు తరలించి విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు నెల రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ఒకే తరహా దోపిడీకి పాల్పడినట్లు రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ వెల్లడించారు.

  • పందుల పోటీలే హైలెట్

Pig Competitions: సాధారణంగా ఉత్సవాలు, జాతరల సందర్భంగా ఎడ్లబండ్ల పోటీలు పొట్టేళ్ల పోటీలు చూస్తుంటాం. కాని అందుకు భిన్నంగా అక్కడ పందుల పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలను చూసేందుకు ప్రజలు సైతం పెద్ద సంఖ్యలో హాజరై వీక్షిస్తుంటారు. ఇంతకీ ఈ పోటీలు ఎక్కడంటే!

  • ఎలక్షన్ డ్యూటీలో మళ్లీ మెరిసిన 'రీనా'

Returning Officer Reena Dwivedi: ఉత్తర్​ప్రదేశ్​ లోక్​సభ ఎన్నికల్లో మెరిసిన సోషల్ మీడియా​ స్టార్​ రీనా ద్వివేది మరోసారి ట్రెండీ లుక్​లో దర్శనమిచ్చారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల విధుల కోసం వచ్చిన ఆమె చుట్టూ చేరిన పోలింగ్​ సిబ్బంది, జనం.. సెల్ఫీల కోసం ఎగబడ్డారు.

  • బజరంగ్​ దళ్ కార్యకర్త హత్యపై దర్యాప్తు

Bajrang Dal activist murder case: కర్ణాటకలో జరిగిన బజరంగ్‌ దళ్‌ కార్యకర్త హత్యకేసులో నిందితులందర్నీ గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించి.. అరెస్టులు ప్రారంభించారు. త్వరలోనే మిగతావారిని అరెస్టు చేస్తామని పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తును ఎన్​ఐఏకు అప్పగించాలని భాజపా నేతలు డిమాండ్ చేస్తున్నారు.

  • ఎంత డబ్బు కావాలో చెప్పు

YS Viveka Murder Case : ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన వివేకా మాజీ డ్రైవర్‌ దస్తగిరి గత సెప్టెంబరు 30న సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదు వివరాలు ఇవాళ వెలుగులోకి వచ్చాయి.

  • బుమ్రాను ఢీకొట్టేందుకు నేను రెడీ

Tim David IPL 2022: టీమ్​ఇండియా స్టార్​ పేసర్​ జస్ప్రీత్​ బుమ్రాను ఎదుర్కొనేందుకు తాను ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు సింగపూర్​ ఆల్​రౌండర్ టిమ్​ డేవిడ్​. బుమ్రా ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లలో ఒకడని.. అతనిని ఎదుర్కొని తనను తాను పరీక్షించుకోవాలని భావిస్తున్నట్లు టిమ్​ చెప్పాడు.

  • త్రివిక్రమ్​పై బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు

Bandla Ganesh Trivikram: పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ నటించిన 'భీమ్లానాయక్​' రిలీజ్​కు​ సిద్ధంగా ఉన్న సమయంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్​ పేరుతో ఓ ఆడియో విపరీతంగా వైరల్​ అవుతోంది. దర్శకుడు త్రివిక్రమ్​పై బండ్ల తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు అందులో ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.