1. సీఎంలతో మోదీ భేటీ
రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. దృశ్య మాధ్యమం ద్వారా ఈ సమావేశం జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. ప్రధాని భేటీలో సీఎం
కరోనా టీకా పంపిణీపై సీఎంలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ప్రగతిభవన్ నుంచి ప్రధానితో సమీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. బడి షురూ
ఫిబ్రవరి నుంచి తెలంగాణలో విద్యాసంస్థలు పునఃప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లతో వివిధ శాఖలపై నిర్వహించిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. కస్టడీలో అఖిలప్రియ
బోయిన్‌పల్లి పోలీసులు ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను కస్టడీలోకి తీసుకున్నారు. అఖిలప్రియను మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. రెక్కీ నిర్వహించి
సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితులు ఉపయోగించిన సెల్‌ఫోన్లు, నకిలీ నంబర్ ప్లేట్లు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. నిలిపివేత
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిలిపివేసింది. వ్యాక్సినేషన్‌కు ఆటంకం కలగకూడదనే షెడ్యూల్ నిలిపివేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ఆటోలో ఆత్మాహుతి
ఉద్యోగంలో నుంచి తొలగించారన్న కారణంతో ఓ వ్యక్తి.. ఆటోలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అందరూ చూస్తుండగానే మంటల్లో కాలిపోయాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. పెరిగిన ధరలు
బంగారం, వెండి ధరలు సోమవారం పెరిగాయి. 10 గ్రాముల పుత్తడి ధర రూ.390 పెరిగింది. కేజీ వెండి ధర రూ.1,137 పెరిగి రూ.65 వేలకు చేరువైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. కోహ్లీ దంపతులకు ఆడపిల్ల
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సోమవారం ఆడ శిశువును ప్రసవించింది. ఈ విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా కోహ్లీ వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. సినిమా అప్డేట్స్
సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో చావు కబురు చల్లగా టీజర్, 'మాస్టర్' తెలుగు డబ్బింగ్ సెన్సార్, జాన్వీ కపూర్ 'గుడ్‌లక్ జెర్రీ', విక్కీ కౌశల్ 'అశ్వథ్థామ' సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.