ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @5PM

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

author img

By

Published : Aug 5, 2022, 4:48 PM IST

Telangana Top News
టాప్​న్యూస్ @5PM
  • దాసోజు శ్రవణ్‌ కాంగ్రెస్‌కు రాజీనామా

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌. కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రకటించి రెండు రోజులు గడవకముందే పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా కాసేపట్లో మీడియా ముందు ప్రకటించనున్నట్లు సమాచారం.

  • క్యాసినో నిర్వహించా.. అందులో తప్పేముంది

Chikoti Praveen at ED Office: క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్‌కు నాలుగో రోజు ఈడీ విచారణ ముగిసింది. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని చీకోటి ప్రవీణ్ అన్నారు. తనకు ప్రాణహాని ఉందని అందుకే రక్షణ కోరుతూ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశానని చెప్పారు. కొందరు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో తన పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి.. తప్పుడు పోస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్​ శ్రేణుల ధర్నా

congress protest at indira park: హైదరాబాద్​లోని ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్​ శ్రేణులు ధర్నాకు దిగారు. నిత్యావసర వస్తువుల ధరలు, జీఎస్టీ, పెట్రో ధరల పెంపునకు నిరసనగా ఆందోళన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

  • ఖర్గేకు వెంకయ్య కౌంటర్​

పార్లమెంట్​ సమావేశాలతో సంబంధం లేకుండా.. దర్యాప్తు సంస్థల విచారణకు హాజరుకావాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్యనాయుడు సూచించారు. గురువారం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన రాజ్యసభలో మాట్లాడారు.

  • కుమారుడ్ని తోసేసిన తల్లి

అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడ్ని అపార్టు​మెంట్​ నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసేసింది ఓ కన్నతల్లి. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన బెంగళూరులో జరిగింది. మరోవైపు, గుజరాత్​.. దాహోద్​ జిల్లాలో 40 అడుగుల లోతైన బావిలో ఓ నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లిపోయారు.

  • మీ EMI ఎంత పెరుగుతుందంటే...

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం ఆర్​బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ క్రమంలో రెపో రేటు ఆధారిత రుణాల రేట్లన్నీ సహజంగానే పెరుగుతాయి. గృహరుణం తీసుకుని, సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే వారు దీన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పటికే రుణం తీసుకున్న వారికీ వడ్డీ రేటు పెరిగినా, నెలవారీ చెల్లించాల్సిన వాయిదాలో మార్పు ఉండదు. రుణం చెల్లించాల్సిన వ్యవధి పెరుగుతుంది.

  • చైనాపై పెలోసీ 'తైవాన్​ పంచ్​'..

Pelosi visit Taiwan: చైనా హెచ్చరికలు పట్టించుకోకుండా విజయవంతంగా తైవాన్ పర్యటన పూర్తి చేశారు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ. తాజాగా ఆమె డ్రాగన్​కు గట్టి కౌంటర్ ఇచ్చారు. అమెరికా అధికారులను తైవాన్​కు వెళ్లకుండా చైనా అడ్డుకోలేదని అన్నారు పెలోసి. తైవాన్​ను ఏకాకి చేస్తానంటే తాము ఊరుకోబోమన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే.. పెలోసీపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది చైనా.

  • సుధీర్‌ గోల్డ్‌ 'లిఫ్ట్'.. వీడియో చూశారా?

పారా వెయిట్‌లిఫ్టర్ సుధీర్‌ తొలిసారి కామన్వెల్త్‌ హెవీ వెయిట్‌లిఫ్టింగ్‌ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాడు. అయితే ఇప్పుడా ప్రదర్శనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సుధీర్‌ ఫీట్‌ను మీరూ చూసేయండి..

  • కల్యాణ్​రామ్​పై ఎన్టీఆర్​ ట్వీట్​..

బింబిసార చిత్రంపై ప్రశంసలు ఎన్టీఆర్​ ప్రశంసలు కురిపించారు. 'బింబిసార' రాజు పాత్రకు తన సోదరుడు కల్యాణ్‌రామ్‌ తప్ప మరెవరూ సరైన న్యాయం చేయలేరని నటుడు ఎన్టీఆర్‌ అన్నారు. ప్రేక్షకుల నుంచి 'బింబిసార'కు వస్తోన్న స్పందనపై తాజాగా తారక్‌ ట్వీట్‌ చేశారు. ఈ సినిమాని తొలిసారి చూసినప్పుడు తామెలాంటి అనుభూతిని పొందామో.. ప్రేక్షకులూ అదే ఆనందాన్ని పొందుతున్నారని పేర్కొన్నారు.

  • రకుల్, మలైకా అందాల విందు..

రకుల్​ప్రీత్​ సింగ్​, మలైకా అరోరా.. అదిరిపోయే డ్రెస్సుల్లో సూపర్​ పోజులు ఇచ్చి సోషల్​మీడియాలో కుర్రాళ్లకు హీట్​ పెంచారు. వారి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. వాటిని చూసేద్దాం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.