ETV Bharat / state

Telangana Top News: టాప్​ న్యూస్ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ న్యూస్ @9PM
టాప్​ న్యూస్ @9PM
author img

By

Published : Jun 22, 2022, 9:00 PM IST

  • 28 నుంచి రైతుబంధు నిధులు విడుదల

అన్నదాతలకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వానాకాలం పెట్టుబడి సాయాన్ని 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్​ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఎప్పటిలాగానే వరుస క్రమంలో అన్నదాతాల ఖాతాల్లో రైతుబంధు నిధులను ప్రభుత్వం జమ చేయనుంది.

  • తెలంగాణలో మరోసారి కరోనా విజృంభణ..

రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. బుధవారం ఒక్కరోజే కొత్తగా 434 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ బారి నుంచి ఇవాళ 129 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,680కి చేరిందని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.

  • కేసీఆర్​పై సీబీఐకి కేఏ పాల్​ ఫిర్యాదు..

KA Paul Complaint on KCR: సీఎం కేసీఆర్​పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్​.. సీబీఐకి ఫిర్యాదు చేశారు. కేసీఆర్​తో పాటు కేటీఆర్​, హరీశ్​రావు, సంతోష్​, కవితపై కూడా ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం, యాదాద్రి ప్రాజెక్టుల్లో భారీగా అవినీతికి పాల్పడ్డారని అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు పాల్​ తెలిపారు.

  • ఈ వానాకాలంలో ఆ పంటకే ప్రభుత్వం ప్రాధాన్యత

హైదరాబాద్‌లో వానాకాలం సాగు పురోగతిపై వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సమీక్షించారు. ఈ ఏడాది వర్షాల ఆలస్యం కావడం సహా.. విత్తనాలు, రసాయన ఎరువులు, ఇతర ఉపకరణాల లభ్యతలపై విస్తృతంగా చర్చించారు.

  • సికింద్రాబాద్‌ విధ్వంసంలో అతడిదే కీలక పాత్ర

Secunderabad riots update: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు మరో 10 మందిని అరెస్ట్​ చేశారు. ఈ అల్లర్లలో మొత్తం 56 మందిని నిందితులుగా చేర్చగా.. ఇప్పటికే 46 మందిని అరెస్ట్​ చేశారు. ఇప్పుడు.. మరో 10 మందిని అరెస్ట్​ చేశారు.

  • 'పదవి కోసం వెంపర్లాడను.. రాజీనామా లేఖ సిద్ధంగా ఉంది

Uddhav Thackeray FB live: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. పదవులు వస్తుంటాయి, పోతుంటాయని.. వాటి కోసం పోరాటం చేయబోనని పేర్కొన్నారు. తన తర్వాత కూడా శివసేన నాయకుడే సీఎం అయితే బాగుంటుందని వ్యాఖ్యానించారు.

  • కమెడియన్​కు రూ.3.91కోట్ల జరిమానా..

1975లో ఓ కమెడియన్​ చేసిన నేరం.. ఇప్పుడు రుజువైంది. 50 ఏళ్ల క్రితం ఓ సినిమా సెట్‌లో అమెరికన్ కమెడియన్‌ బిల్‌ కాస్బీ.. ఓ బాలికను తనను లైంగికంగా వేధించారు. కొన్ని సంవత్సరాల తర్వాత.. ఆమె బిల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  • 11వేల వోల్టుల కరెంటు తీగ తాకి వ్యక్తి సజీవదహనం

బిహార్​లోని బేతియాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. 11వేల వోల్టుల హెటెన్షన్​ వైరు మీద పడి భూతి ప్రసాద్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తీగ తగలగానే మంటలు చెలరేగి సజీవదహనమయ్యాడు. మృతుడు తన ఇంట్లోని తలుపు దగ్గర కూర్చున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

  • 'పంత్​ కెప్టెన్​ అవ్వకుండా కచ్చితంగా అడ్డుకునేవాడిని'

రిషభ్​ పంత్​ను కెప్టెన్​ అవ్వకుండా కచ్చితంగా అడ్డుకునేవాడినని చెప్పాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ మదన్​లాల్​. భారత జట్టుకు నాయకత్వం వహించాలంటే సాధారణ విషయం కాదని, అందుకు పంత్ ఇంకా పరిణతి చెందాల్సిన అవసరం ఉందని అన్నాడు.

  • ఫిలింసిటీలో మొక్కలు నాటిన సల్మాన్‌

salman khan green india challenge in Rfc: గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రామోజీ ఫిలింసిటీలో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ మొక్కలు నాటారు. పచ్చదనం ఉంటేనే గాలి, నీరు బాగుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోశ్‌ కుమార్‌ను సల్మాన్‌ ప్రశంసించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.