ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @ 9PM

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

top-news
టాప్​టెన్​ న్యూస్​ @ 9PM
author img

By

Published : Apr 20, 2021, 8:59 PM IST

1. నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ

తెలంగాణలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ రాత్రి 9 గంటల నుంచి 30 తేదీ ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కర్ఫ్యూ నుంచి ఆస్పత్రులు, ఫార్మసీలు, ల్యాబ్‌లకు మినహాయింపు ఇచ్చారు. రాత్రి 8 గంటలకే కార్యాలయాలు, దుకాణాలు, హోటళ్ల మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. భక్తులు లేకుండానే..

రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వల్ల కల్యాణ వేడుక సామూహికంగా జరుపుకోలేకపోతున్నామని అన్నారు. భద్రాద్రిలో పూజారులు, అధికారుల సమక్షంలో రాములోరి కల్యాణం జరుగుతుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. థియేటర్లు బంద్​

తెలంగాణలో రేపటి నుంచి సినిమా థియేటర్లు పాక్షికంగా మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రదర్శనలపై సినీ నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శనకారులు ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా సినిమా హాల్స్​ను పాక్షికంగా బంద్ చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ప్రచారం కుదింపు

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మినీపురపోరు సమయాన్ని కుదించారు. కొవిడ్ కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రచార సమయాల్లో మార్పులు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. విషయం తేలాల్సిందే..

రంగారెడ్డి భాజపా జిల్లా కమిటీ నేతలు కేటీఆర్​ను కలవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ తెలిపారు. లింగోజీగూడ డివిజన్​ ఉపఎన్నికను ఏకగ్రీవం చేయడానికి కేటీఆర్​ను ఎందుకు కలవాల్సి వచ్చిందనే అంశాలను తెలుసుకోవడానికి నిజనిర్ధారణ కమిటీని వేశామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 'కేంద్రం టీకా విధానం బూటకం'

పలు రాష్ట్రాల్లో తగినన్ని కరోనా టీకా డోసులు అందుబాటులో లేని సమయంలో ప్రధాని మోదీ తన ప్రతిష్ఠను పెంచుకోవడానికే విదేశాలకు టీకా ఎగుమతి చేశారని బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల వల్ల దేశం.. టీకా కొరత సమస్యను ఎదుర్కొంటోందని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. వెనక్కి తగ్గితేనే..

వాస్తవాధీన రేఖ వద్ద శాంతిని కొనసాగించడానికి కుదిరిన ఏకాభిప్రాయాన్ని పాటించకుండా ఉండరాదని చైనాకు భారత్‌ స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ జరగాలంటే తూర్పు లద్దాఖ్‌లో చైనా తమ బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. దిగొచ్చిన పుత్తడి

దేశీయంగా పసిడి, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. మంగళవారం.. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.47 వేల దిగువకు చేరింది. వెండి ధర కిలో రూ.110కి పైగా తగ్గింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. షెడ్యూలు ప్రకారమే..

ముందుగా నిర్ణయించిన తేదీల్లోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ను నిర్వహిస్తామని ఐసీసీ స్పష్టం చేసింది. దేశంలో కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. యూకే, భారత్​ను 'రెడ్​ లిస్ట్'​లో చేర్చింది. అయినప్పటికీ మ్యాచ్ ​షెడ్యూల్​ ప్రకారమే జరుగుతుందని వెల్లడించింది. ఆ తుదిపోరులో న్యూజిలాండ్​తో తలపడనుంది టీమ్​ఇండియా. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.సినీ కార్మికులకు ఉచిత టీకా

45 ఏళ్లు పైబడిన సినీ కార్మికులకు, సినీ జర్నలిస్టులకు కరోనా క్రైసిస్ ఛారిటీ తరఫున ఉచితంగా వ్యాక్సిన్​ను అందిస్తున్నట్లు తెలిపారు మెగాస్టార్​ చిరంజీవి. ప్రముఖ ఆస్పత్రి అపోలో 247 సౌజన్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.