1. పదేళ్లు నేనే
ముఖ్యమంత్రి మార్పుపై కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. తానే సీఎంగా ఉంటానని కుండబద్దలకొట్టారు. ఎమ్మెల్యేలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించిన ఆయన.. త్వరలో జరగనునున్న నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. కాంగ్రెస్ శంఖారావం
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని లూఠీ చేస్తున్నారని పదేపదే మాట్లాడుతున్న భాజపా నేతలు... ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. 2018లో కాంగ్రెస్‌కు తిరుగులేదని నిరూపించిన ఖమ్మం నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తామని నేతలు ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. పర్యటనలో ఉద్రిక్తత
సూర్యాపేట జిల్లా మంఠంపల్లి మండలం గుర్రంపోడులో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించారు. గిరిజన భూములు ఆక్రమించారంటూ భాజపా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలో రాజీవ్ రైతు భారోసా దీక్షకు హాజరైన రేవంత్... హైదరాబాద్‌కు పాదయాత్రగా బయలుదేరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. గంటలో కోటి మొక్కలు
ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఒక్క గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. దేవభూమిలో ప్రళయం
ఉత్తరాఖండ్‌లో మరోసారి జలప్రళయం సంభవించింది. నందాదేవి హిమానీనదంలో ఒక భాగం కట్టలు తెంచుకోవడం వల్ల రిషి గంగా, ధౌలి గంగా నదులకు ఆకస్మిక వరదలు సంభవించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. 150 మంది విద్యార్థులకు కరోనా
కేరళలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కొవిడ్ కలకలం రేపింది. 150 మంది విద్యార్థులు సహా 34 మంది ఉపాధ్యాయలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. డాక్టర్ వద్దకు బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆర్థోపెడిక్ నిపుణుడ్ని సంప్రదించారు. గతంలో కాలు బెణికిన గాయానికి చికిత్సలో భాగంగా డాక్టర్లు ఎక్స్-రే పరీక్షలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ఆ ప్లేస్‌లో సినిమా తీస్తే హిట్టే!
తెరపై వినోదాన్ని వడ్డించడంలో పల్లె ముందుంటుంది. గోదావరి యాసతో తెరపై హంగామా చేసిన చిత్రాలు విజయవంతంగా ఆడాయి. ఊరంటే నీరు, వ్యవసాయం.. ఆ తర్వాత నుడికారాలు, మమకారాలు, జనం, సందడి. వీటన్నింటికీ తూర్పు తీరం ఆలవాలం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. అమితాబ్‌కు ఫ్లింటాఫ్ చురక
ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండ్ ఆండ్రూ ఫ్లింటాప్ బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు చురకలంటించాడు. ఐదేళ్ల క్రితం రూట్‌ను పొగుడుతూ ఫ్లింటాఫ్ చేసిన ఓ ట్వీట్‌కు అమితాబ్ వ్యంగ్యాస్త్రం సంధించిన నేపథ్యంలో ఇప్పుడు సరదాగా ప్రతీకారం తీర్చుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.