ETV Bharat / state

సీసీ కెమెరాల ఏర్పాటులో దేశంలోనే తెలంగాణ టాప్‌ - Telangana top in setting up of cameras

దేశంలోనే సీసీ కెమెరాల ఏర్పాటులో రాష్ట్రం అగ్రభాగాన నిలుస్తోంది. రోజురోజుకి నేర పరిశోధనలో సీసీ కెమెరాలు కీలకంగా మారుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వీటి ప్రాధాన్యత పెరిగిపోతుంది. నేరాన్ని నియంత్రించాలన్నా, దర్యాప్తులో ముందుకెళ్లాలన్నా ఇప్పుడు సీసీ కెమెరాల దృశ్యాలు అత్యవసరాలు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్‌శాఖ వీటి ఏర్పాటును అవశ్యంగా భావిస్తోంది.

Telangana top in setting up of cameras
సీసీ కెమెరాల ఏర్పాటులో దేశంలోనే తెలంగాణ టాప్‌
author img

By

Published : Feb 7, 2020, 9:38 AM IST

ప్రజా భద్రత చట్టానికి అనుగుణంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించడంపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వపరంగా ప్రధాన కూడళ్లలోనివే కాక కాలనీలు, నివాస సముదాయాల్లోనూ వీటిని బిగించేలా ప్రజల్ని చైతన్యపరుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10లక్షల సీసీ కెమెరాల ఏర్పాటు దిశగా ముమ్మర యత్నాలు సాగిస్తోంది. ఏడాది క్రితం వరకు దేశవ్యాప్తంగా ఏర్పాటైన సీసీ కెమెరాల్లో ఒక్క తెలంగాణలోనే దాదాపు 65శాతం ఉండటం ఇందుకు నిలువెత్తు నిదర్శనం. పోలీస్‌ పరిశోధన, అభివృద్ధి సంస్థ(బీపీఆర్‌డీ) ఇటీవల విడుదల చేసిన ‘డేటా ఆన్‌ పోలీస్‌ ఆర్గనైజేషన్స్‌’ నివేదిక ఇదే విషయాన్ని వెల్లడించింది. 2019 జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా పోలీస్‌ సంస్థలకు సంబంధించిన వివరాల్ని ఈ నివేదికలో పొందుపరిచారు.

2019 జనవరి 1 నాటికి ఇదీ లెక్క..

  1. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తం 4,27,529 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు.
  2. వాటిలో ఒక్క తెలంగాణలోనే 2,75,528 కెమెరాలు బిగించడం విశేషం. మొత్తం కెమెరాల్లో ఇది దాదాపు 65శాతం.
  3. రెండో స్థానంలో నిలిచిన తమిళనాడులో వీటి సంఖ్య 40,112 మాత్రమే. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర(39,587), మధ్యప్రదేశ్‌(21,206) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 14,770 సీసీ కెమెరాలున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో వీటి సంఖ్య పదివేల లోపే.
  4. 19 రాష్ట్రాల్లో కేవలం వెయ్యి వంతునా లేవు. ఆరు రాష్ట్రాల్లో వంద లోపు ఉండగా.. లక్షద్వీప్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌ల్లో వీటి సంఖ్య సున్నా.

కమిషనరేట్లలోనూ ఘనమే..

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పోలీస్‌ కమిషనరేట్ల విషయంలోనూ తెలంగాణ ముందు వరుసలోనే ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం 63 కమిషనరేట్లుండగా.. తెలంగాణలో వాటి సంఖ్య తొమ్మిది. అంతకన్న మిన్నగా ఒక్క మహారాష్ట్రలో మాత్రమే 11 కమిషనరేట్లున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్లు ఉండేవి. తెలంగాణ ఏర్పడ్డాక రాచకొండ, వరంగల్‌ కమిషనరేట్లు, కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం, రామగుండం, సిద్దిపేట కమిషనరేట్లు మనుగడలోకి వచ్చాయి. తెలంగాణ తర్వాత పశ్చిమ్‌బెంగాల్‌, తమిళనాడులో ఏడు చొప్పున కమిషనరేట్లున్నాయి.

మొత్తంగా సీసీ కెమారాల ఏర్పాటులో తెలంగాణ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

ఇదీ చూడండి: నిర్భయ దోషుల ఉరిపై దిల్లీ కోర్టుకు తిహార్​ అధికారులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.