ఏపీలో రాజధాని అమరావతి కోసం మహిళలు చేసే ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు జ్యోత్స్న స్పష్టం చేశారు. రాజధాని పర్యటనలో భాగంగా కృష్ణాయ పాలెంలో దీక్షా చేస్తున్న మహిళలకు తెదేపా నేతలు మద్దతుగా నిలిచారు. వారితో కలిసి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.
రాజధాని ఐకాస పిలుపు మేరకు తాము ఎలాంటి సహకారమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని జ్యోత్స్నపేర్కొన్నారు. తె. తెదేపా మహిళా నేతలకు స్థానిక మహిళలు ఆకుపచ్చ కండువాలతో సత్కరించారు.
ఇదీ చదవండి: బతుకు పోరాటంలో కుటుంబానికి మహిళల చేదోడు