Telangana Student Died in IIT Guwahati : అసోంలోని ఐఐటీ గువాహటి(IIT Guwahati)లో ఇంజినీరింగ్ చదువుతున్న తెలంగాణకు చెందిన విద్యార్థిని ఓ హోటల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గౌహతి నగరంలోని పల్టన్ బజార్‌లోని సిటీ ప్యాలెస్ హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలిని బీటెక్ నాలుగో ఏడాది చదువుతున్న పుల్లూరి ఐశ్వర్యగా గుర్తించారు. ఈ విషయాన్ని ఐఐటీ గువాహటి ధ్రువీకరించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఈసీఈ చదువుతున్న ఐశ్వర్యతో పాటు ఆమె ముగ్గురు స్నేహితులు ఐఐటీ క్యాంపస్‌కు 25 కి.మీల దూరంలోని ఓ హోటల్‌లో రెండు గదులను బుక్ చేసుకున్నారు. డిసెంబర్ 31వ తేదీన రాత్రి జీఎస్ రోడ్‌లోని బార్‌లో న్యూ ఇయర్ పార్టీలో పాల్గొని మద్యం సేవించారు. ఆ తర్వాత విద్యార్థిని మరో ముగ్గురు స్నేహితులతో కలిసి హోటల్‌కు చేరుకుంది.
Telangana Student Death In IIT Guwahati : జనవరి 1వ తేదీన ఉదయం తనతో పాటు గదిలో ఉన్న మరో స్నేహితురాలు వాష్ రూమ్‌కు వెళ్లగా అక్కడ ఐశ్వర్య అచేతనావస్థలో ఉండటాన్ని గుర్తించారు. వెంటనే హోటల్ సిబ్బంది ఆమెను గువాహటి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, హోటల్ సిబ్బందిని, ఐశ్వర్య స్నేహితులను విచారించారు.
భార్య కోసం భర్త బలవన్మరణం.. కుమార్తెతో సహా..!
Suspicious Death of Student : డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి హోటల్ తనిఖీలో భాగంగా వెళ్లినప్పుడు ఐశ్వర్యతో పాటు ఇతర స్నేహితులు మత్తులో ఉన్నట్లు సిబ్బంది చెప్పారని పోలీసులు వెల్లడించారు. న్యూ ఇయర్ పార్టీ ముగించుకుని అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో వీరంతా బాగా మద్యం సేవించి హోటల్‌కు వచ్చారని తెలియజేశారు.
boy suspicious death: పాపం పసివాడు... పండగ వేళ అనుమానాస్పద మృతి
యువతి అతిగా మద్యం సేవించడం వల్లే మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే మృతికి కచ్చితమైన కారణం తెలుస్తుందని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతురాలి ముగ్గురు స్నేహితులను విచారిస్తున్నారు. ఐశ్వర్య మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులకు ఐఐటీ గువాహటి యాజమాన్యం సమాచారం అందించారు. ఐశ్వర్య మృతి చాలా బాధాకరమని, ఈ ఘటనకు సంబంధించి తగిన విచారణ చేపట్టాలని పోలీసులను కోరినట్లు కళాశాల యాజమాన్యం వెల్లడించింది.
డిగ్రీ విద్యార్థి అనుమానాస్పద మృతి..
బీ ఫార్మసీ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. ఈరోజు మరోసారి పోస్టుమార్టం