Telangana State Wide Karthika Pournami Pooja : రాష్ట్రవ్యాప్తంగా భక్తులతో శివాలయాలు నిండిపోయాయి. కార్తీక పౌర్ణమి కారణంగా తెల్లవారుజామున నుంచే శివుని దర్శనానికి భక్తులు అధిక సమయం వేచి ఉన్నారు. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. కృష్ణా, గోదావరి నదుల్లో భక్తులు స్నానాలు చేసి మహిళలు దీపాలు వెలిగించారు. భోళాశంకరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించారు. రాష్ట్రంలో దేవాలయాలు భక్తులతో సందడిగా మారింది.
Karthika Pournami Celebrations Hyderabad : కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు, హుజుర్‌నగర్‌లో శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఖమ్మంలో శివాలయాలు కార్తీక పూజలతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున మూడు గంటల నుంచే మహిళలు భారీ సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. కార్తీకదీపం(Karthika Deepam) వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. నగరంలోని రాజరాజేశ్వరి అమ్మవారి(Raja Rajeswari Temple) ఆలయం, గుంటు మల్లేశ్వరాలయ, సుగ్గుల వారి తోట శివాలయాలు భక్తుల రద్దీతో నిండిపోయాయి. భద్రాచలంలోని గోదావరి నదిలో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి.. కార్తీక దీపాలు వదిలారు. అనంతరం ఆలయాల వద్ద పూజలు నిర్వహించారు.
లక్ష దీపాల వెలుగుల్లో వేయిస్తంభాల గుడి
Karthika Pournami Celebrations in Telangana : భాగ్యనగరంలోని శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. కార్తీక సోమావారం(Karthika Masam) సందర్భంగా నగరంలోని పలు శివాయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీకమాసం అయినందున.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలను ఆచరించి.. కార్తీక దీపాలను వెలిగించారు.
Karthika Pournami Celebration in Warangal : ఓరుగల్లులోని వెయ్యి స్తంభాల ఆలయంలో కార్తీక మాస శోభ సంతరించుకుంది. కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని దీపాలు వెలిగిస్తున్నారు. సంగారెడ్డిలోని.. పోతి రెడ్డి పల్లిలో శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో సూర్యోదయానికి ముందు నుంచే దీపాలను వెలిగించి భక్తులు మొక్కులను తీర్చుకుంటున్నారు. ఆలయ ప్రాంగణం అంతా పిండి పదార్థంతో తయారు చేసిన దీపాలను వెలిగించారు.
Kartika pournami: రాష్ట్రవ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు.. రద్దీగా శైవ క్షేత్రాలు
Karthika Pournami Celebration in Nalgonda : నల్గొండ జిల్లా, మిర్యాలగూడలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని.. శివాలయాల్లో.. తెల్లవారుజాము నుంచే భక్తులు కార్తీకదీపం వెలిగించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించారు. అటు సిద్దిపేట జిల్లాలో కూడా అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఉసిరి,పిండి దీపాలు వెలిగించారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో శివాలయాలు భక్తులతో సందడిగా మారాయి.
jwalaa thorana mahothsavam: కార్తీక పౌర్ణమి ప్రత్యేకం.. కన్నుల పండువగా జ్వాలాతోరణ మహోత్సవం