ETV Bharat / state

ఈ నెల 21న పోలింగ్​ కేంద్రాల తుది జాబితా: ఎస్​ఈసీ

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరుకు ఓటింగ్​ స్లిప్​లు అందేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్​ పార్థసారథి సూచించారు. ఎన్నికల్లో సాధారణ ఎన్నికల పరిశీలకుల పాత్ర అత్యంత విలువైందని.. ఒక్కో జోన్ పరిధిలోని వార్డులకు ఒక సాధారణ ఎన్నికల పరిశీలకులను నియమించినట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల తుది జాబితా ఈ నెల 21న ప్రకటిస్తామన్నారు.

author img

By

Published : Nov 18, 2020, 7:48 PM IST

ఈ నెల 21న పోలింగ్​ కేంద్రాల తుది జాబితా: ఎస్​ఈసీ
ఈ నెల 21న పోలింగ్​ కేంద్రాల తుది జాబితా: ఎస్​ఈసీ

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఓటరుకూ ఓటింగ్​ స్లిప్​లు అందేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి ఆదేశించారు. రాజకీయ పార్టీలు కూడా పార్టీ గుర్తు లేకుండా ఓటరు స్లిప్పులు పంచవచ్చన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సాధారణ పరిశీలకులతో ఎస్​ఈసీ పార్థసారథి సమీక్షించారు.

ఎన్నికల్లో సాధారణ ఎన్నికల పరిశీలకుల పాత్ర అత్యంత విలువైందని.. ఒక్కో జోన్ పరిధిలోని వార్డులకు ఒక సాధారణ ఎన్నికల పరిశీలకులను నియమించినట్లు పార్థసారథి వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల తుది జాబితా ఈ నెల 21న ప్రకటిస్తామని.. పరిశీలకులు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, అభ్యర్థుల ఎన్నికల వ్యయం వంటి విషయాలు పరిశీలించాలని సూచించారు. పరిశీలకులు ప్రతి విషయాన్ని పరిశీలిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పర్యవేక్షించాలని ఎన్నికల కమిషనర్​ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పోటీ చేసే అభ్యర్థులు పారదర్శకత పాటించాలి: పార్థసారథి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.