ETV Bharat / state

ముగియనున్న బడ్జెట్ సమావేశాలు.. నేడు ఉభయసభల్లో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ - telangana budget sessions

Telangana Budget Sessions 2023-24 : రాష్ట్రబడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరిరోజైన ఇవాళ ద్రవ్యవినిమయ బిల్లుపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది. శాసనసభ ఆమోదించిన మూడు బిల్లులు, అనుబంధ అంచనా వ్యయంతో పాటు మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక చేపట్టనున్నారు.

బడ్జెట్ సమావేశాలు
బడ్జెట్ సమావేశాలు
author img

By

Published : Feb 12, 2023, 7:05 AM IST

Updated : Feb 12, 2023, 7:14 AM IST

Telangana Budget Sessions 2023-24 : ఈ నెల మూడో తేదీన ప్రారంభమైన రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. 2023 - 24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​పై సాధారణ చర్చతో పాటు పద్దులపై కూడా ఇప్పటికే చర్చ పూర్తయ్యింది. శాసనసభలో గత మూడు రోజులుగా మొత్తం 37 పద్దులపై చర్చించి ఆమోదించారు. దీంతో ఇవాళ ద్రవ్యవినిమయ బిల్లుపై ఉభయసభల్లో చర్చ జరగనుంది.

మొదట శాసనసభలో, ఆ తర్వాత మండలిలో చర్చ చేపడతారు. ఆర్థికశాఖా మంత్రి హరీష్​రావు 2023 - 24 ఆర్థిక సంవత్సరం ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టనుండగా... బిల్లుపై చర్చకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు. మండలిలో హరీష్ రావు సమాధానం ఇస్తారు. బస్తీ దవఖానాలు, గురుకులాలు, హరితవనాలు, పునరుత్పాదక ఇంధన వనరులు, సమీకృత వ్యవసాయ మార్కెట్లు, మామిడి మార్కెట్, పంట రుణాల మాఫీ, కోతుల బెడద, అక్షరాస్యత అంశాలు శాసనసభ ప్రశ్నోత్తరాల్లో చర్చకు రానున్నాయి.

అసెంబ్లీ ఇప్పటికే ఆమోదించిన వ్యవసాయ విశ్వవిద్యాలయ, పురపాలక, పంచాయతీరాజ్ చట్టసవరణల బిల్లులతో పాటు 2022 - 23 బడ్జెట్ అదనపు అంచనాలపైనా మండలిలో చర్చ జరగనుంది. జీఎస్టీ పరిహారం, ఆర్టీసీచే హైస్పీడ్ డీజిల్ వినియోగం, భవన క్రమబద్దీకరణ , గురుకులాల్లో డిప్యూటీ వార్డన్ల నియామకం, దివ్యాంగులకు సంక్షేమ పథకాలు, జంట నగరాల్లో మెట్రో రైల్ విస్తరణ, పురావస్తు సంపద పరిరక్షణ, డిగ్రీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్​మెంట్ అంశాలు కౌన్సిల్ ప్రశ్నోత్తరాల్లో చర్చకు రానున్నాయి.

శాసనమండలి వైస్​ ఛైర్మన్ ఎన్నిక : తెలంగాణ శాసనమండలి ఉపాధ్యక్షుని (వైస్‌ ఛైర్మన్‌)గా పూర్వ వరంగల్‌ జిల్లాకు చెందిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‌ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ పదవికి శనివారం సాయంత్రం అయిదుగంటల గడువు ముగిసేసరికి ఆయన ఒక్కరే నామినేషన్‌ వేశారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆదివారం ప్రకటించనున్నారు. మంత్రులు కేటీ రామారావు, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌, మహమూద్‌అలీతో కలిసి బండా ప్రకాశ్‌ నామినేషన్‌ పత్రాలను శాసనమండలి కార్యదర్శి, ఎన్నికల అధికారి నరసింహాచార్యులుకు ఆయన కార్యాలయంలో అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, గంగాధర్‌ గౌడ్‌, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ తదితరులు పాల్గొని ప్రకాశ్‌ను అభినందించారు. అనంతరం ఆయన శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం ఉదయం శాసనమండలిలో ఉదయం 10గంటలకు ఉపాధ్యక్ష పదవి ఎన్నిక ఫలితాన్ని ప్రకటిస్తారు. అనంతరం ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

.

ఇవీ చదవండి:

Last Updated : Feb 12, 2023, 7:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.