ఉమ్మడి జిల్లాల పశు గణాభివృద్ధి సంస్థ ఛైర్మన్లతో రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ రాజేశ్వరరావు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌ను కలిశారు. పాడి రైతులను ఆదుకొని, పశు గణాభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఆవులు, గేదెలకు కృత్రిమ గర్భధారణ ద్వారా కేవలం ఆడ దూడలు పుట్టేలా కొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని, దీనిద్వారా పాల ఉత్పత్తితోపాటు పశు గణాభివృద్ధికి ఆస్కారం ఉందని ఛైర్మన్లు వివరించారు.
సానుకూలంగా స్పందించిన వినోద్... త్వరలో ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పశువుల కృత్రిమ గర్భధారణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఆ సంస్థ రాష్ట్ర ఛైర్మన్ రాజేశ్వరరావు తెలిపారు.