రాష్ట్రంలో పంట కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లిన రైతులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయని రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి టీ సాగర్ అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి లేఖ రాశారు. యాసంగిలో రికార్డ్ స్థాయిలో దిగుబడి వచ్చిందని చెప్పారు.
పంట బాగా వచ్చిందని రైతులు సంతోషించారు. కానీ ఐకేపీ కేంద్రాలు, సహకార సంఘాల కేంద్రాల్లో తేమ పేరుతో, తాలు పేరుతో క్వింటా ధాన్యం నుంచి దాదాపు రెండున్నర కిలోలు తరుగు తీస్తున్నారని తెలిపారు. ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు పూర్తయిన తర్వాత మిల్లులకు ధాన్యం వెళ్లేదాకా రైతులే కాపలాగా ఉండాలని చెబుతున్నారు ఆయన తెలిపారు.
రైస్ మిల్లులకు వెళ్లిన తర్వాత మళ్లీ తరుగు తీస్తున్నారని చెప్పారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన తర్వాత తేమ ఎక్కువగా ఉందంటున్నారని.. ఆర పెట్టమని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెప్పడం వల్ల రైతులు పంటను ఆరబెడుతున్నారని తెలిపారు. అకాల వర్షాల వల్ల ఆరబెట్టిన పంట తడిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై హైకోర్టులో పిల్