ETV Bharat / state

TSRTC: ఖాళీగా ఉంచడానికి వీలుకాదు.. వదులుకోడానికి మనసు రాదు

నగరం బాగా అభివృద్ధి చెందుతోంది. విశ్వనగర కీర్తిని అందుకోడానికి పరుగులు పెడుతోంది అంటూ ఏసీ బస్సులను (ac bus) టీఎస్‌ఆర్టీసీ (ts rtc) సమకూర్చుకుంది. కాని వాటిని ఎలా తిప్పాలో తెలియక తికమక పడుతోంది. ఇలాగే వజ్ర బస్సుల విషయంలోనూ తలలు పట్టుకుంటోంది. ఏం చేయాలో పాలుపోక డిపోల్లోనే మగ్గపెడుతోంది. మొత్తం 80 ఏసీ మెట్రో లగ్జరీ బస్సులు ఎలా ఉన్నాయనే విషయమై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కదలిక లేక బస్సుల్లో ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది.

metro luxury
metro luxury
author img

By

Published : Jul 7, 2021, 8:13 AM IST

ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు.. కాని ఏ ఒక్క ఐడియా టీఎస్‌ఆర్టీసీని మార్చడంలేదనడానికి మెట్రో లగ్జరీ (metro luxury bus) బస్సులే ఉదాహరణ. ఏసీ బస్సులతో ప్రయాణికులను ఆకట్టుకోవచ్చనే ఆర్టీసీ ఆలోచన(ts rtc) అడ్డం తిరిగింది. హైదరాబాద్​లో పరిధిలో ఉన్న 80 ఏసీ మెట్రో లగ్జరీ బస్సులు ఎలా ఉన్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రతి రోజూ ఒకటి రెండు బస్సులు బయటకు తీసి పాడవ్వకుండా జాగ్రత్త పడుతున్నామని అధికారులు చెబుతున్నారు.

గతేడాది మార్చి 23 నుంచి ప్రజారవాణా ఆగిపోయింది. తర్వాత 2020 సెప్టెంబరు 26 తర్వాత సిటీ బస్సులు రోడ్డెక్కాయి. ఏసీ బస్సులు కావడంతో ప్రయాణికుల నుంచి స్పందన లేక మెట్రో లగ్జరీ బస్సులను డిపోల నుంచి బయటకు తీయలేదు. జనవరి నాటికి పరిస్థితులు సర్దుకుంటున్నాయని భావించి వాటిని మెట్రో రైలు లేని మార్గాల్లో నడపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఈసీఐఎల్‌ నుంచి మెహిదీపట్నం మీదుగా గచ్చిబౌలి. దిల్‌సుక్‌నగర్‌ - లింగంపల్లి 218డి, 222ఎల్‌ ఎల్‌బీనగర్‌ - పటాన్‌చెరు మార్గాలతో పాటు.. బాలానగర్‌ మీదుగా సికింద్రాబాద్‌ - కూకట్‌పల్లి మధ్య 219తో బస్సులు నడిపారు. ఇంతలో మళ్లీ కరోనా విజృంభనతో వాటిని డిపోలకు పరిమితం చేశారు. మధ్యలో రెండు నెలలు తిరిగాయో లేదో మళ్లీ ఆగిపోయాయి.

నడపాలా? వద్ధా.?

మెట్రో రైలు టిక్కెట్‌ కంటే ధర ఎక్కువగా ఉందనే విమర్శలూ ఉన్నాయి. ప్రయోగాత్మకంగా ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని నడిపితే కిలోమీటరుకు రూ.30 కూడా రావడంలేదు. కిలోమీటరుకు రూ. 80 వస్తే ఆ బస్సు లాభాల బాట పడతాయి. కరోనాకు ముందు రూ. 45 నుంచి రూ. 55 వరకూ ఆదాయం వచ్చింది. కొన్ని మార్గాల్లో రూ. 60 కూడా కిలోమీటరుకు సమకూరేది. కరోనా తర్వాత అలాంటి పరిస్థితులు లేవు. ఐటీ కార్యాలయాలు తెరచుకోని పరిస్థితుల్లో ఈ బస్సులను తిప్పడం ఆర్టీసీకి పెనుభారమే అవుతుంది. దీనికి తోడు డీజిల్‌ ధర పెరిగింది.

దూర ప్రాంతాలకే ఈ బస్సులు

ఇలాంటి తరుణంలో దూర ప్రాంతాలకు ఈ బస్సులు నడపాలని టీఎస్‌ఆర్టీసీ భావిస్తోంది. అది కూడా విజయవాడ మార్గంలో అయితేనే ఆదరణ ఉంటుందని గ్రహించి ఇప్పటికే ఒక బస్సులో సీట్లు మార్చి దూరప్రాంతానికి అనుకూలంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఇంతలో కరోనా రెండో విడత వచ్చి అంతర్రాష్ట్ర బస్సులు ఆగిపోయాయి. మరో 6 బస్సుల వరకూ సీట్లు మార్చుతున్నారు. దాదాపుగా ఈ పనులు పూర్తయ్యాయి. మొత్తమ్మీద మెట్రో లగ్జరీ బస్సులు టీఎస్‌ఆర్టీసీకి గుదిబండగా మారాయి.

ఇదీ చూడండి: VAJRA service: ప్రయాణికులు లేరని వజ్ర బస్సులు అమ్మేస్తారట..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.