Telangana Corona Cases: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత నెలలో నిత్యం మూడు వేలకుపైగా వచ్చిన కేసులు అంతకంతకూ తగ్గుతున్నట్టు ఆరోగ్య శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గడచిన 24 గంటల్లో 81,417 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... వారిలో 2,421 మందికి వైరస్ సోకినట్టు ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 2,441 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉన్నట్టు స్పష్టం చేసింది. ఇక తాజాగా వచ్చిన పాజిటివ్ కేసులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 7,71,828 మంది మహమ్మారి బారిన పడ్డారు. వారిలో తాజాగా 3,980 మంది కోలుకోగా మరో ఇద్దరు మృతి చెందారు.
గడచిన 24గంటల్లో కోలుకున్న వారితో కలిపి ఇప్పటి వరకు 7,34,628 మంది వైరస్ నుంచి రికవరి అయ్యారు. కాగా కరోనా మరణాలు 4,096కి చేరాయి. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులలో ఆదిలాబాద్ 50, భద్రాద్రి కొత్తగూడెం 80, జీహెచ్ఎంసీ 649, జగిత్యాల 49, జనగామ 57, జయశంకర్ భూపాలపల్లి 19, జోగులాంబ గద్వాల 14, కామారెడ్డి 34, కరీంనగర్ 80, ఖమ్మం 83, కొమరంభీం ఆసిఫాబాద్ 13, మహబూబ్నగర్ 72, మహబూబాబాద్ 50, మంచిర్యాల 64, మెదక్ 52, మేడ్చల్ మల్కాజిగిరి 144, ములుగు 20, నాగర్ కర్నూల్ 48, నల్గొండ 100, నారాయణపేట 16, నిర్మల్ 55, నిజామాబాద్ 47, పెద్దపల్లి 36, రాజన్న సిరిసిల్ల 51, రంగారెడ్డి 114, సంగారెడ్డి 57, సిద్దిపేట 58, సూర్యాపేట 58, వికారాబాద్ 30, వరంగల్ రూరల్ 33, హన్మకొండ 106, యాదాద్రి భువనగిరిలో 51 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి : Telangana Corona Cases: కాస్త తగ్గిన కరోనా ఉద్ధృతి.. తాజాగా 2,646 కేసులు