ETV Bharat / state

'రాష్ట్ర ప్రజానీకానికి ధరణి ఒక దరిద్రంలా మారింది' - ధరణి పోర్టల్​

రియల్టర్ల సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రియల్టర్ల అసోసియేషన్​ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్​ ఆరోపించారు. జీవో 135, ఎల్ఆర్ఎస్​ను రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్​లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

telangana  realtor state president praveen elligation for Dharani has become a pauper for the people of the state
'రాష్ట్ర ప్రజానికానికి ధరణి ఒక దరిద్రంలా మారింది'
author img

By

Published : Feb 23, 2021, 8:38 PM IST

తెలంగాణ ప్రజలకు ధరణి ఓ దరిద్రంలా తయారైందని రియల్టర్ల అసోసియేషన్​ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్​ ఆరోపించారు. గ్రామ పంచాయతీ లే ఔట్లలో ప్లాట్లను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. రాష్ట్ర సర్కారు రూపొందించిన జీవో 135, ఎల్ఆర్ఎస్​ను రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్​లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ధరణి పోర్టల్ విజయవంతమైందని చెప్పి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ప్రవీణ్​ ఆరోపించారు. రియల్టర్ల సమస్యల పరిష్కారం కోసం అనేకసార్లు రిజిస్ట్రేషన్ ఐజీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్​లను కలవడానికి ప్రయత్నిస్తే అపాయింట్​మెంట్​ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై స్పందించపోతే త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల ఓటమికి కృషి చేస్తామని ఆయన హెచ్చరించారు.

ఇదీ చదవండి: తమిళిసై నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.