బడ్జెట్లో వ్యవసాయ శాఖకు కేటాయింపులు పెంచాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. రైతులకు న్యాయం చేయాలని కోరుతూ.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి లేఖ రాసింది. సంఘం ప్రతినిధులు హైదరాబాద్ జవహర్ నగర్లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో.. లేఖ విడుదల చేశారు.
వ్యవసాయ శాఖకు కేటాయింపుల పెంపుతో పాటు.. పంట రుణాలు, రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయ ప్రణాళిక, ప్రకృతి వైపరిత్యాల పరిహారం, సబ్సిడీలు, మార్కెట్ జోక్యం వంటి పలు అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సంఘం కోరింది.
ఐదెకరాల లోపు ఉన్న దాదాపు 10 లక్షల మందికి నేటికీ రైతుబంధు అందలేదు. అర్హులందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలి. రైతు బీమాను 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు గల వాళ్లందరికీ వర్తింప జేయాలి. సమగ్ర వ్యవసాయ ప్రణాళికను ఏప్రిల్ మొదటి వారంలోనే విడుదల చేయాలి.
- సంఘం ప్రతినిధులు
ఇదీ చదవండి: 'ఈ ఎన్నికల్లో ఓటర్లు డబ్బుకు అమ్ముడు పోవొద్దు'