ETV Bharat / state

Telangana Rains Today : రాష్ట్రంలో జోరువాన.. మరో మూడ్రోజులూ అప్రమత్తంగా ఉండాల్సిందే - హైదరాబాద్​లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

Heavy Rains in Telangana : వానరాక కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఊరట లభించింది. రాష్ట్రవ్యాప్తంగా నిన్న భారీ వర్షాలు కురిశాయి. దాదాపు అన్ని మండలాల్లో వానలు పడ్డాయి. ఒక్కరోజులో 21 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మూడురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని.. సీఎస్‌ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు.

Heavy Rain Alert To Telangana
Heavy Rain Alert To Telangana
author img

By

Published : Jul 19, 2023, 7:09 AM IST

వానరాకతో రైతులకు ఊరట.. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు

Telangana Rain Alert Today : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని దాదాపు అన్ని మండలాల్లో వానలు కురిశాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కన్నాయిగూడెంలో అత్యధకంగా 98.4 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. పెంకవాగు పొంగి ప్రవహిస్తుండడంతో.. కొత్త గుంపు, కలిపాక, పెంకవాగు, తిప్పాపురం గ్రామాలకు రాక పోకలు నిలిచిపోయాయి.

Heavy Rain Alert To Telangana : మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భారీ వర్షాలతో.. ప్రాణహిత, గోదావరికి వరద పోటెత్తుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలో రెండు రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. వర్షాలు, ఎగువ నుంచి వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. మంగళవారం సాయంత్రానికి 19 అడుగులకు నీటిమట్టం చేరింది. వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరుగుతుందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.

Rains in Telangana 2023 : వరణుడి కరుణతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వ్యవసాయ పనులు జోరందుకునే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ ఖమ్మం జిల్లాల్లో చెరువులు, వాగులు జలకళను సంతరించుకుంటున్నాయి. రాష్ట్రంలో మూడు రోజుల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం, షీయర్‌ జోన్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో హెచ్చరికలు జారీచేసింది.

Heavy Rains In North Telangana : భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్‌, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భారీ నుంచి అతిభారీ వర్షాలకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తనష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎస్‌ శాంతికుమారి సూచించారు.

రెవెన్యూ, పోలీస్, నీటిపారుదల, పంచాయతీరాజ్‌, విద్యుత్‌, ఆర్‌అండ్‌బీ శాఖలు సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాలు, పాత వంతెనలను ఇప్పటికే గుర్తించినట్లు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. వాతావరణ శాఖ సమాచారంతో.. జీహెచ్​ఎమసీ అప్రమత్తమైంది. మాన్‌సూన్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదేశించారు. కొత్త సెల్లార్ తవ్వకాలను అనుమతించకూడదని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.