విద్యుత్ ఉద్యోగుల విభజన చిలికి చిలికి గాలివానలా మారుతోంది. 1157 మంది ఉద్యోగుల్లో 655 మందిని ఏపీకి, 502 మందిని తెలంగాణకు కేటాయిస్తూ ఏకసభ్య కమిటీ ధర్మాధికారి నివేదికను ఇచ్చారని C తెలిపారు. ఆ తర్వాత మరో 71 మందిని అనారోగ్యం, స్పౌస్కు సంబంధించిన విషయంలో పరిగణలోకి తీసుకోవాలని ధర్మాధికారి నివేదికలో పేర్కొన్నారు. ఆ నివేదిక ప్రకారం 573 మందిని తెలంగాణాలో చేర్చుకునేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.
కానీ... ఇందులో ఎటువంటి సంబంధం లేని 584 మందిని ఏపీ నుంచి రిలీవ్ చేశారని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటువంటి వారిని ఇక్కడ చేర్చుకుంటే... చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికత ప్రకారమే ఉద్యోగుల నియామకం జరగాలని వారు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఏపీ విద్యుత్ ఉద్యోగులను తెలంగాణాలో చేర్చుకోనివ్వబోమని తేల్చి చెప్పారు.
ధర్మాధికారి నివేదికను అమలు చేయడానికి తెలంగాణ సిద్ధంగా ఉందని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలు కూడా ఆ విధంగానే ఉన్నాయని, కానీ... ఏపీ విద్యుత్ సంస్థలు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా... 584 మంది ఉద్యోగులను విధుల నుంచి రిలీవ్ చేశారని ఆయన తెలిపారు. అది ధర్మాధికారి నివేదికకు విరుద్ధంగా జరిగింది కాబట్టే... తెలంగాణలో వారిని విధుల్లోకి తీసుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. ధర్మాధికారి చెప్పిన దాని ప్రకారం ఆయా ఉద్యోగులను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ఇవీ చూడండి: ముగ్గురు పిల్లలపై సవతితల్లి అరాచకత్వం