ETV Bharat / state

కొవిడ్‌ ఆందోళనలో పోలీసులు.. ఆరోగ్య భద్రత పరిధిలోకి తేవాలని వినతి

పోలీసు శాఖను కరోనా కలవరపెడుతోంది. ఎన్ని జాగ్రత‌్తలు తీసుకుంటున్నా... వైరస్ బారిన పడుతున్నారు. బందోబస్తు విధులు, కేసుల కోసం తిరుగుతున్నప్పుడు వైరస్‌ సోకుతోంది. ఇలా ఇప్పటి వరకూ దాదాపు వెయ్యి మంది సిబ్బందికి వైరస్ నిర్ధారణ అయింది. కరోనా సోకితే మెరుగైన చికిత్స అందించాలని, ఇందుకోసం కొవిడ్ చికిత్సను ఆరోగ్య భద్రత పరిధిలోకి తేవాలని వారు కోరుతున్నారు.

corona
corona
author img

By

Published : Jul 13, 2020, 7:12 AM IST

  • రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో హత్య జరిగింది. దర్యాప్తులో భాగంగా సంబంధిత అధికారి హత్యాస్థలానికి, పోస్టుమార్టం నివేదిక కోసం ఉస్మానియా ఆసుపత్రితో పాటు అనేక ప్రాంతాలకు తిరగాల్సి వచ్చింది. ఇది జరిగిన నాలుగు రోజులకు సంబంధిత అధికారికి జ్వరం వచ్చింది. పరీక్ష చేయించుకోగా కరోనా నిర్ధారణ అయింది.
  • హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో చోరీ కేసులో నిందితుణ్ని పట్టుకున్నారు. రిమాండుకు తరలించడంలో భాగంగా నిబంధనల ప్రకారం కోఠిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్ష నిర్వహించేందుకు అతన్ని పోలీసు సిబ్బంది తీసుకెళ్లారు. తర్వాత వారికి కొవిడ్‌ సోకింది.

ఇలా ఇప్పటి వరకూ దాదాపు వెయ్యి మంది సిబ్బంది కొవిడ్‌ కోరల్లో చిక్కారు. పోలీసు పని అంటేనే జనంతో మమేకం కావడం. అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ వైరస్‌ నుంచి తప్పించుకోవడం సాధ్యం కావడంలేదని సిబ్బంది వాపోతున్నారు. ఒకవేళ కరోనా సోకితే మెరుగైన చికిత్స అందించాలని, ఇందుకోసం దీన్ని కూడా పోలీసు సిబ్బంది వైద్య చికిత్సల కోసం ఉద్దేశించిన ఆరోగ్య భద్రత పరిధిలోకి తేవాలని వారు కోరుతున్నారు. తద్వారా ఒకవేళ కొవిడ్‌ సోకినా మెరుగైన చికిత్స అందుతుందనే భరోసా కలుగుతుందని వారు చెబుతున్నారు.

ప్రభుత్వానికి లేఖ

మహమ్మారిని ఆరోగ్య భద్రత పరిధిలోకి తెచ్చేందుకు ఉన్నతాధికారులు కూడా కృషి చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కొవిడ్‌ బారిన పడితే తక్షణ సాయం కింద రూ.5 వేలు ఇస్తున్నారు. కొన్నిచోట్ల అవసరమైతే ప్రైవేటు వైద్య సాయం అందిస్తున్నారు. ‘ఇప్పటికే సిబ్బంది సంక్షేమానికి ఉన్నతాధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అవసరమైన సాయం చేస్తున్నారు’ అని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: హోం క్వారంటైన్​లో ఉన్నవారికి కరోనా కిట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.