ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @ 3PM - Telangana News Today

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

Telangana News Today
Telangana News Today
author img

By

Published : Aug 5, 2022, 3:00 PM IST

  • మీ EMI ఎంత పెరుగుతుందంటే...

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కోసం ఆర్​బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ క్రమంలో రెపో రేటు ఆధారిత రుణాల రేట్లన్నీ సహజంగానే పెరుగుతాయి. గృహరుణం తీసుకుని, సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే వారు దీన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పటికే రుణం తీసుకున్న వారికీ వడ్డీ రేటు పెరిగినా, నెలవారీ చెల్లించాల్సిన వాయిదాలో మార్పు ఉండదు. రుణం చెల్లించాల్సిన వ్యవధి పెరుగుతుంది.

  • పోలీసుల అదుపులో రాహుల్, ప్రియాంక

Congress protest on inflation: కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలు పలుచోట్ల ఉద్రిక్తంగా మారాయి. దిల్లీలో పాదయాత్రగా రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ఎంపీలను.. విజయ్ చౌక్​ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్, ప్రియాంక సహా ఇతర నేతల్ని అదుపులోకి తీసుకున్నారు.

  • అనని మాటను అన్నట్టు చూపించొద్దు

Bandi Sanjay Clarity on Komatireddy Issue : భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తమతో టచ్​లో ఉన్నారని తాను అనలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ స్పష్టం చేశారు. అనని మాటలను అన్నట్లు బ్రేకింగ్స్​ పెట్టొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా నాలుగో రోజు భట్టుపల్లికి చేరుకున్నారు.

  • వెంకన్న మనస్తాపం చెందాల్సిన అవసరం లేదు

Revanth Reddy on MP Venkat Reddy : ''మీరు' వెన్నుపోటు పొడుస్తున్నారు' అని కోమటిరెడ్డి బ్రదర్స్​ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కుటుంబసభ్యుడని.. తాను రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడినట్లు చెప్పారు. తనకు, వెంకట్​రెడ్డికి మధ్య కొందరు అగాధం సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. అపోహలతో వెంకన్న మనస్తాపం చెందాల్సిన అవసరం లేదని రేవంత్ అన్నారు.

  • విపక్ష కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి తెరాస మద్దతు

TRS Supports Margaret Alwa : రాష్ట్రపతి ఎన్నికలో అనుసరించిన విధానాన్నే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాలని తెరాస అధిష్ఠానం నిర్ణయించింది. ఈ మేరకు విపక్ష కూటమి అభ్యర్థి మార్గరెట్​ అల్వాకు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నారు. తెరాసకు చెందిన మొత్తం 16 మంది తెరాస ఎంపీలు పార్లమెంట్​ భవనంలో రేపు జరగనున్న ఎన్నికలో మార్గరెట్​ అల్వాకు మద్దతుగా ఓటు వేయనున్నారు.

  • ఇందిరాపార్కు వద్ద కాంగ్రెస్​ శ్రేణుల ధర్నా

congress protest at indira park: హైదరాబాద్​లోని ఇందిరా పార్కు వద్ద కాంగ్రెస్​ శ్రేణులు ధర్నాకు దిగారు. నిత్యావసర వస్తువుల ధరలు, జీఎస్టీ, పెట్రో ధరల పెంపునకు నిరసనగా ఆందోళన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

  • ఆడపిల్ల పుట్టిందని అమానుషం..

గుజరాత్​ సాబర్​కాంఠాలో దారుణం జరిగింది. అప్పుడే జన్మించిన పసికందును భూమిలో పాతిపెట్టేశారు ఆమె తల్లిదండ్రులు. బాలిక ప్రాణాలతో ఉండగానే ఇలా చేశారు. పొలానికి వెళ్లిన ఓ రైతు బాలిక కదలికను గమనించి బయటకు తీశాడు. అనంతరం చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాడు. బాలిక తల్లిదండ్రులు ఇలా ఎందుకు చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక తండ్రి శైలేష్, తల్లి మంజును అరెస్ట్ చేశారు.

  • చైనాపై పెలోసీ 'తైవాన్​ పంచ్​'..

Pelosi visit Taiwan: చైనా హెచ్చరికలు పట్టించుకోకుండా విజయవంతంగా తైవాన్ పర్యటన పూర్తి చేశారు అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ. తాజాగా ఆమె డ్రాగన్​కు గట్టి కౌంటర్ ఇచ్చారు. అమెరికా అధికారులను తైవాన్​కు వెళ్లకుండా చైనా అడ్డుకోలేదని అన్నారు పెలోసి. తైవాన్​ను ఏకాకి చేస్తానంటే తాము ఊరుకోబోమన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే.. పెలోసీపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది చైనా.

  • సుధీర్‌ గోల్డ్‌ 'లిఫ్ట్'.. వీడియో చూశారా?

పారా వెయిట్‌లిఫ్టర్ సుధీర్‌ తొలిసారి కామన్వెల్త్‌ హెవీ వెయిట్‌లిఫ్టింగ్‌ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాడు. అయితే ఇప్పుడా ప్రదర్శనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సుధీర్‌ ఫీట్‌ను మీరూ చూసేయండి..

  • రకుల్, మలైకా అందాల విందు..

రకుల్​ప్రీత్​ సింగ్​, మలైకా అరోరా.. అదిరిపోయే డ్రెస్సుల్లో సూపర్​ పోజులు ఇచ్చి సోషల్​మీడియాలో కుర్రాళ్లకు హీట్​ పెంచారు. వారి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. వాటిని చూసేద్దాం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.