గులాబీ దళపతి సుదీర్ఘ కసరత్తు
మంత్రి వర్గ కూర్పుపై గులాబీ దళపతి సుదీర్ఘ కసరత్తు చేశారు. ప్రజాసంబంధాలు, జిల్లాల ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణాలు, అనుభవం అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తుది జాబితా రూపొందించారు. పాత జిల్లాల ప్రకారం చూస్తే ఖమ్మం తప్ప అన్నీ జిల్లాలకు మంత్రివర్గంలో చోటు కల్పించినట్లయింది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం శాఖల కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వులు అధికారికంగా వెలువడనున్నాయి.
రాజ్భవన్లో ఏర్పాట్లు
రాజ్భవన్లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు 1200 మంది అతిథులకు ఆహ్వానాలు పంపించారు. కొత్త మంత్రులు ఎలాంటి హడావుడి లేకుండా కుటుంబ సభ్యులతో మాత్రమే రావాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు సమాచారం.