క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం, తప్పిదాల కారణంగా హైదరాబాద్ నగరంలో వరుసగా (recents deaths in hyderabad)చోటుచేసుకుంటోన్న మరణాలపై పట్టణాభివృద్ధి శాఖ (telangana ministry of urban development )ఆగ్రహం వ్యక్తం చేసింది. వర్షాలు, విద్యుదాఘాతం, మ్యాన్‌హోళ్లు తెరిచి ఉంచటం- నిర్వహణ లోపం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేయకపోవడం, బారికేడ్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరిగిన ఘటనల్లో పౌరులు, క్షేత్రస్థాయి సిబ్బంది మృత్యువాత పడడం.. వారి కుటుంబాల్లో తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని పట్టణాభివృద్ధి శాఖ ఆవేదన వ్యక్తం చేసింది.
మూడు రోజులే..
రానున్న మూడు రోజుల్లో నగరంలో ప్రమాదపు అంచున ఉన్న పరిస్థితులు, ప్రాంతాలను జీహెచ్ఎంసీ, పట్టణాభివృద్ధి శాఖ అధికారులు గుర్తించి, తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు తక్షణమే ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు, ఔట్‌సోర్స్ స్టాఫ్ ఏజెన్సీలు, టౌన్ ప్లానింగ్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు, బిల్డర్లు అందరూ సమావేశమై సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
వేటేస్తాం..
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, పౌరులు తమ పరిధిలో ప్రమాదకర పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరింది. పౌరులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఆకస్మిక మరణాలను కొన్ని సురక్షిత, భద్రతా పరమైన చర్యలు తీసుకోవటం (recents deaths in hyderabad)ద్వారా కాపాడుకోవచ్చని పట్టణాభివృద్ధి శాఖ పేర్కొంది. ఇకపై క్షేత్రస్థాయిలో ఎటువంటి ప్రమాదం జరిగినా ఆ పరిస్థితికి కారణమైన కాంట్రాక్టరు, హెచ్‌వోడి, ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీని బాధ్యులను చేసి వారిపై తక్షణ వేటుతో పాటు, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని (telangana ministry of urban development)పట్టణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది.
ఇవీచూడండి: