ETV Bharat / state

గగనానికేగిన గానగంధర్వునికి రాష్ట్ర మంత్రుల సంతాపం - సింగర్​ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి వార్తలు

ప్రముఖ నేపథ్యగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

telangana ministers condolences on sp bala Subrahmanyam  death
గగనానికేగిన గానగంధర్వునికి రాష్ట్ర మంత్రుల సంతాపం
author img

By

Published : Sep 25, 2020, 5:29 PM IST

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి, మంత్రులు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎస్పీ బాలు ఎన్నో పాటలను ఆలపించి ప్రజల మనసుల్లో సుస్థిరంగా నిలిచారని తెలంగాణ రాష్ట్ర మంత్రులు అన్నారు. సినీ ప్రపంచానికి, సంగీత అభిమానులకు, లక్షలాది బాలు అభిమానులకు ఇది తీరని లోటని మంత్రులు విచారం వ్యక్తం చేశారు.

అనేక భాషల్లో పాటలు పాడి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఎస్పీ బాలు లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిదని ఈటల రాజేందర్​, తలసాని శ్రీనివాస్​యాదవ్​, వేముల ప్రశాంత్​రెడ్డి, పువ్వాడ అజయ్​కుమార్​, ఇంద్రకరణ్​రెడ్డి, ఎర్రబెల్లి, జగదీశ్​రెడ్డి, శ్రీనివాస్​గౌడ్​, సత్యవతి రాఠోడ్​, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. బాలు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇదీ చదవండిః బాలు పార్థివదేహానికి అశ్రునివాళి- భారీగా తరలిన జనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.