Minister Sabitha on Tamilisai Letter: విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామకాల బోర్డు బిల్లుకు సంబంధించి గవర్నర్ తమిళిసై నుంచి తనకు ఎలాంటి లేఖ రాలేదని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. నిజంగా లేఖ వస్తే స్పందిస్తానని ఆమె వెల్లడించారు. తనకు లేఖ రాయకుండానే రాసినట్లు చెప్పడం సరికాదన్నారు. ఉమ్మడి నియామకాల బోర్డుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. వాటిపై రాజ్‌భవన్‌కు వచ్చి చర్చించాలని గవర్నర్ సోమవారం విద్యాశాఖ మంత్రికి లేఖ రాసినట్లు ప్రచారం జరిగింది. బిల్లును పంపించిన వెంటనే అభ్యంతరాలు తెలిపితే వాటిని నివృత్తి చేసేవారమని.. 54 రోజులు పెండింగ్ పెట్టి.. ఇప్పుడు సమాచారం అడగడం భావ్యం కాదని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
Governor Vs Telangana Government : విశ్వవిద్యాలయాల అభివృద్ధి, విద్యార్థులకు లబ్ధి, నిరుద్యోగులకు మేలు కోసం ప్రభుత్వం ఈ బిల్లు తెచ్చిందని స్పష్టంచేశారు. గవర్నర్ తమిళిసై బిల్లు పెండింగులో పెట్టడం వల్ల నియామకాల్లో జాప్యం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే నియామకాలు చేపట్టాలని విద్యార్థులు, నిరుద్యోగులు కోరుతున్నారని తెలిపారు. రాజ్‌భవన్ వర్గాలు ఈ అంశంపై స్పష్టతనిచ్చాయి. ప్రభుత్వ వివరణ కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి గవర్నర్ లేఖ రాశారని.. అందులో విద్యాశాఖ మంత్రిని రాజ్‌భవన్‌కు వచ్చి చర్చించాలని సూచించినట్లు పేర్కొన్నాయి.
ఇవీ చదవండి: