Telangana Merger Day Celebrations in CPI Office Hyderabad : అప్పటి భూస్వాములు, రజాకార్లకు వ్యతిరేకంగా.. రైతులు, కమ్యూనిస్టుల సాయుధ పోరాటం ఫలితంగానే.. స్వాతంత్య్ర తెలంగాణ ఆవిర్భవించిందని సీపీఐ నాయకులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 17(September 17)ను పురస్కరించుకని తెలంగాణ విలీన వేడుకలను.. సీపీఐ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు.
September 17 Celebrations in telangana : నేడు కొన్ని రాజకీయపార్టీలు తమ రాజకీయ పబ్బం కోసం చరిత్రను వక్రీకరిస్తున్నాయని.. వివిధ పేర్లతో తెలంగాణ విలీన దినోత్సవాలను నిర్వహిస్తున్నాయని సీపీఐ(CPI) జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి(Chada Venkat Reddy)) మండిపడ్డారు. ఉమ్మడి పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని.. అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రోశయ్యను డిమాండ్ చేసిన కేసీఆర్.. నేడు తన ప్రభుత్వ హయాంలో ఎందుకు అధికార లాంఛనాలతో నిర్వహించడం లేదని ప్రశ్నించారు.
CPI Latest News : స్వరాష్ట్రం సాధించాక తాము అధికారంలోకి వచ్చిన అనంతరం.. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ విలీన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని పేర్కొన్న కేసీఆర్.. నేడు ఎవరికి భయపడి అధికారికంగా నిర్వహించడం లేదో తెలంగాణ సమాజానికి తెలుసన్నారు. తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని నిర్మించిన కేసీఆర్.. రైతాంగ సాయుధ పోరాట అమరుల స్థూపాన్ని ఎందుకు నిర్మించలేదని చాడ ప్రశ్నించారు.
"నేడు కొన్ని రాజకీయపార్టీలు తమ రాజకీయ పబ్బం కోసం.. వివిధ పేర్లతో తెలంగాణ విలీన దినోత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఉమ్మడి పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన కేసీఆర్.. నేడు ఎందుకు నిర్వహించడం లేదు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక.. ఎవరకి భయపడి నిర్వహించడం లేదో తెలంగాణ సమాజానికి తెలుసు". - చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత.. సైనిక చర్య ద్వారా తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని(Koonanneni Sambasivarao) పేర్కొన్నారు. పేదవారిని, అణగారిన వర్గాల ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న ఆనాటి రజాకార్లను, దేశ్ముఖ్లు, జమీందార్లు, జాగీర్దార్లకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటంలో ఎంతో మంది అసువులు బాశారన్నారు. రైతాంగ పోరాటం, అమర వీరుల పోరాట స్పూర్తితో ముందుకు వెళ్తామన్నారు.
"దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత.. సైనిక చర్య ద్వారా తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చింది. పేదవారిని, అణగారిన వర్గాల ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న.. ఆనాటి రజాకార్లను, దేశ్ముఖ్లు, జమీందార్లు, జాగీర్దార్లకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటంలో ఎంతో మంది అసువులు బాశారు. రైతాంగ పోరాటం, అమర వీరుల పోరాట స్పూర్తితో ముందుకు వెళ్తాం". - కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి