తెలంగాణ లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చింతపల్లి వెంకటరాములు, ఉప లోకాయుక్తగా విశ్రాంత జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయశాఖ మాజీ కార్యదర్శి వొలిమినేని నిరంజన్‌రావు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వీరితో ప్రమాణం చేయించారు. అనంతరం గవర్నర్, సీఎం కేసీఆర్ లోకాయుక్త, ఉపలోకాయుక్తకు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. లోకాయుక్త, ఉపలోకాయుక్తలు అయిదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.