KRMB: కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ రాసింది. బ్రహ్మంసాగర్ ఎడమ కాల్వపై అక్రమంగా ఎత్తిపోతల నిర్మిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌పై ఫిర్యాదు చేసింది. ఏపీ ప్రభుత్వం బేసిన్ వెలుపలకు నీటిని తరలిస్తోందన్న లేఖలో పేర్కొంది. విభజన చట్టానికి విరుద్ధంగా కొత్త ప్రాజెక్టు చేపట్టడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది.
ఏపీ ప్రభుత్వ చర్యలతో సాగర్ ఆయకట్టుకు ఇబ్బందులు వస్తాయని లేఖలో వెల్లడించింది. విభజన చట్టానికి విరుద్ధంగా కొత్త ప్రాజెక్టు చేపట్టడం సరి కాదని కేఆర్ఎంబీకి వివరించింది. ఎత్తిపోతల నిర్మాణంతో హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఇబ్బంది ఏర్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఏపీ చేపట్టిన తెలుగుగంగ ప్రాజెక్టు విస్తరణ పనులు అడ్డుకోవాలని బోర్డును లేఖలో కోరింది.
ఇవీ చదవండి: 'కేసీఆర్ బొమ్మతో కాదు.. నా సొంత పని తీరుతోనే గెలుస్తూ వచ్చా..'
సోనియాను ఆరు గంటలు ప్రశ్నించిన ఈడీ.. మరోసారి రావాలంటూ సమన్లు..