ETV Bharat / state

Telangana mlc polls under mla quota: వచ్చే నెలలోనే శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు..! - తెలంగాణ శాసన మండలి సభ్యుల ఎన్నికలు

పెద్దలసభకు ఎన్నికల కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. శాసనసభ కోటాలో జూన్ నుంచి ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది ( Telangana mlc polls under mla quota). కరోనా కారణంగా గతంలో ఎన్నికలు నిర్వహించని కేంద్ర ఎన్నికల సంఘం... వచ్చే నెలలో ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది.

mandali
mandali
author img

By

Published : Oct 16, 2021, 4:49 AM IST

శాసనమండలిలో జూన్ నుంచి ఆరు ఖాళీలు కొనసాగుతున్నాయి (Telangana mlc polls under mla quota). అసెంబ్లీ కోటా నుంచి మండలికి గతంలో ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఫరీదుద్దీన్, ఆకుల లలిత పదవీకాలం జూన్ మూడో తేదీతో ముగిసింది. వాస్తవానికి ఆ లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ రెండో వేవ్ కారణంగా అప్పట్లో ఎన్నికలు నిర్వహించలేదు. కరోనా నేపథ్యంలో నిర్దిష్ట గడవులోగా ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామని, ఎప్పుడు నిర్వహించేది తదుపరి ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం అప్పట్లో ప్రకటించింది.

రాష్ట్రాల అభిప్రాయాలు సేకరణ

కొవిడ్ సెకండ్​ వేవ్​ ప్రభావం కొంత మేర తగ్గిన తర్వాత... ఎన్నికల నిర్వహణ విషయమై ఆగస్టు నెలలో ఈసీ... రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. కరోనా పాజిటివ్ కేసులు బాగానే నమోదవుతున్న దృష్ట్యా ఎన్నికలు ఇపుడే నిర్వహించవద్దని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. నవంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించాలని సూచించింది (Telangana mlc polls under mla quota). ఆ తర్వాత హుజూరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఉన్న ఉపఎన్నికల విషయమై కూడా రాష్ట్రాలను కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయాలు తీసుకొంది. రెండు రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలు సానుకూలంగా లేకపోవడంతో కొంత సమయం తీసుకొని ఈసీ ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.

వచ్చే నెలలోనే ఎన్నికలు...!

ప్రస్తుతం ఉపఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. లక్షల మంది ఓటర్లు పాల్గొనే ఎన్నికలు కొనసాగుతున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా త్వరలోనే జరుగుతాయని అంటున్నారు (Telangana mlc polls under mla quota). కేవలం శాసనసభ్యులు ఓటు వేసే ఎన్నికలు అయినందున ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని... ఎన్నికలు నిర్వహించవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో మండలి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావచ్చని అంటున్నారు.

ఛైర్మన్​, డిప్యూటీ ఛైర్మన్​ పదవులకు కూడా..

ఛైర్మన్​తో పాటు డిప్యూటీ ఛైర్మన్ పదవీకాలం కూడా జూన్ మూడో తేదీన పూర్తైన నేపథ్యంలో ప్రస్తుతం ప్రొటెం ఛైర్మన్​గా భూపాల్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆరు స్థానాలకు ఎన్నికలు జరిగితే కొత్త ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ పదవులకు ఎన్నికలు కూడా నిర్వహించవచ్చని అంటున్నారు (Telangana mlc polls under mla quota).

వచ్చే ఏడాది జనవరిలో మరో 12 స్థానాలు ఖాళీ

అటు జనవరి నెలలో మరో 12 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. స్థానిక సంస్థల కోటాలో ఎన్నికైన 12 మంది పదవీకాలం 2022 జనవరి నాలుగో తేదీతో పూర్తి కానుంది. హైదరాబాద్ జిల్లాకు చెందిన రెండు మినహా స్థానికసంస్థల ఎమ్మెల్సీ స్థానాలన్నీ ఖాళీ కానున్నాయి. పురాణం సతీష్ కుమార్, భానుప్రసాదరావు, నారదాసు లక్ష్మణరావు, భూపాల్ రెడ్డి, సుంకరి రాజు, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, కల్వకుంట్ల కవిత పదవీకాలం జనవరి నాలుగో తేదీతో పూర్తి కానుంది. ఈ స్థానాలన్నీ కూడా అధికార తెరాస సభ్యులవే(Telangana mlc polls under mla quota) .

ఇదీ చూడండి: KTR at TS Council: 'ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో రాష్ట్రానికి రూ.5, 600 కోట్లు వచ్చాయి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.