ETV Bharat / state

కరోనాపై పోరులో సాంకేతికత అత్యంత కీలకం: కేటీఆర్​

ఆధునిక సాంకేతికతతో విద్య, వైద్యసేవలను గ్రామీణ ప్రాంతాలకు చేరవేయడంలో తెలంగాణ ముందు వరుసలో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. భవిష్యత్​లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాల్టీ తదితర సాంకేతికలతో సేవలను మరింతగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించిన గ్లోబల్ టెక్నాలజీ గవర్నమెంట్ సమ్మిట్​లో కేటీఆర్ ప్రసంగించారు.

కరోనాపై పోరులో సాంకేతిక అత్యంత కీలకం: కేటీఆర్​
ktr, global technology meet
author img

By

Published : Apr 7, 2021, 3:39 PM IST

సేవింగ్ లైఫ్స్ విత్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే అంశంపై జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించిన గ్లోబల్​ టెక్నాలజీ గవర్నమెంట్​ సమ్మిట్​లో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. జపాన్ నుంచి నిర్వహించిన ఈ సమావేశంలో రువాండా ఐటీ శాఖా మంత్రి పౌల ఇనగంబిరే, ప్రపంచ వ్యాప్తంగా 45 ప్రముఖ వైద్య, సాంకేతిక, టెక్నాలజీ కంపెనీల అధిపతులు పాల్గొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, ఐరోపాతో పాటు అన్ని దేశాల్లోని వైద్యరంగంలో మౌలిక వసతుల కొరతను కరోనా సంక్షోభం ఎత్తిచూపిందని తెలిపారు. వివిధ దేశాలు ఒక సహకార ధోరణితో ఈ సంక్షోభానికి అంతం పలికేందుకు ఏడాదిగా నిరంతరం శ్రమిస్తున్నాయని అన్నారు.

గ్లోబల్ టెక్నాలజీ గవర్నమెంట్ సమ్మిట్​లో కేటీఆర్ ప్రసంగం

ఎమర్జింగ్ టెక్నాలజీ వినియోగంలో ముందున్నాం..

కరోనా లాంటి మహమ్మారిపై సాగించే పోరులో సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యంగా ఎమర్జింగ్ టెక్నాలజీల పాత్ర అత్యంత కీలకంగా మారిందని కేటీఆర్ వివరించారు. ఎమర్జింగ్ టెక్నాలజీలను వాడుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం ముందు వరుసలో ఉందని... భూసంస్కరణలు, ఇతర పాలనా సంస్కరణల్లో సాంకేతిక పరిజ్ఞానానికి పెద్ద పీట వేసి ముందుకు పోతున్నామని వివరించారు. సమాజ క్షేమానికి దోహదపడని సాంకేతిక పరిజ్ఞానం వృథా అన్నది సీఎం కేసీఆర్ ఆలోచనా విధానమని కేటీఆర్​ అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని పౌర సేవలు, సమాజ హితానికి ఎలా వాడుకోవాలో ఎప్పటికప్పుడు సమీక్షించుకొని ముందుకెళ్తున్నామని తెలిపారు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో కలిసి పైలట్ ప్రాజెక్టు

కరోనా కట్టడి, విద్య, వైద్య సదుపాయాలను సాంకేతికత ద్వారా గ్రామీణప్రాంతాలకు అందిస్తున్నామని... అయితే ఈ రంగాల్లో టెక్నాలజీల వినియోగం ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలో ఉందని చెప్పారు. భవిష్యత్తులో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ వంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అనేక రెట్లు ప్రజలకు ప్రయోజనాలు కల్పించే వీలు కలుగుతుందని కేటీఆర్ తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్య సేవల పరిధిని విస్తరించే అవకాశాలను తెలంగాణ ఉపయోగించుకుంటుందని మంత్రి చెప్పారు. అత్యవసర సమయాల్లో డ్రోన్ల సాంకేతికత వినియోగానికి సంబంధించి ఇప్పటికే వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో కలిసి ఓ పైలట్ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టినట్లు తెలిపారు. కరోనా వంటి మరో సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే ప్రపంచంలోని ప్రతి మానవుని హెల్త్ ప్రొఫైల్​ను డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై సాయంత్రం సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.