రెండు నెలలుగా కరోనాపై చర్చ జరుగుతున్నప్పటికీ... ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజలకు ఉచితంగా మాస్కులను పంపిణీ చేయాలన్నారు.
ప్రజా అవసరాల దృష్ట్యా ఖాళీగా ఉన్న సచివాలయ భవనాన్ని ఐసోలేషన్ వార్డుగా సిద్ధం చేయాలని చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు. కరోనాపై వస్తున్న వదంతులను నమ్మొద్దని... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.