ETV Bharat / state

రేపు ఇంటర్ ఫలితాలు

author img

By

Published : Jun 26, 2022, 10:42 PM IST

Updated : Jun 27, 2022, 2:02 AM IST

TS Intermediate Results 2022: ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు ప్రకటించనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. జవాబు పత్రాల మూల్యాంకనం సహా అన్ని ప్రక్రియలు పూర్తయిన సందర్భంగా తప్పులు రాకుండా సాఫ్ట్​వేర్​ ద్వారా పరిశీలిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి జలీల్​ పేర్కొన్నారు.

ఈ నెల 28న ఇంటర్​ ఫలితాలు
ఈ నెల 28న ఇంటర్​ ఫలితాలు

TS Intermediate Results 2022: ఇంటర్​ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్​ ప్రకటించారు. ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామన్నారు. పరీక్షలన్నీ మే 24తో పూర్తికాగా అదే నెల 8 నుంచి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. ఫలితాలను జూన్​ 20లోపు వెల్లడిస్తామని నెల రోజుల క్రితమే ఇంటర్​ బోర్డు కార్యదర్శి జలీల్​ వెల్లడించారు. తాజాగా ప్రక్రియ మొత్తం పూర్తైనందున తప్పులు రాకుండా సాఫ్ట్​వేర్​ ద్వారా పరిశీలిస్తామన్నారు జలీల్​.

మే 6 నుంచి మే 24 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. మొదటి ఏడాదిలో సుమారు 4 లక్షల 64 వేలు... రెండో ఏడాదిలో దాదాపు 4 లక్షల 39 వేల మంది పరీక్షలు రాశారు. కరోనా ప్రభావంతో ఈ ఏడాది 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు నిర్వహించారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్​డ్​ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని జలీల్​ గతంలోనే ప్రకటించారు.

ఇవీ చూడండి..

ఈ నెల 28న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా టీ హబ్​-2 ప్రారంభం

త్వరలోనే రామ్​ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?

Last Updated : Jun 27, 2022, 2:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.