ETV Bharat / state

ఏ చట్టం ప్రకారం పింఛన్లలో కోత విధించారు: హైకోర్టు - తెలంగాణ తాజా వార్తలు

విశ్రాంత ఉద్యోగుల పింఛన్ల కోతపై దాఖలైన పిటిషన్​పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఏ చట్టం ప్రకారం కోత విధించారో తెలపాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన న్యాయస్థానం... తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.

high court on pension issue
ఏ చట్టం ప్రకారం పింఛన్లలో కోత విధించారు: హైకోర్టు
author img

By

Published : Jun 17, 2020, 12:50 PM IST

ఏ చట్టం ప్రకారం విశ్రాంత ఉద్యోగుల పింఛన్లపై కోత విధించారో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పింఛన్ల కోతపై దాఖలైన పిటిషన్​పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఇవాళ వివరణ ఇవ్వాలని ఈనెల 15న ప్రభుత్వాన్ని ఆదేశించింది. వేతనాలు, పింఛన్ల కోతపై ఆర్డినెన్స్ జారీ చేసినట్లు ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఆ ఆర్డినెన్స్ వివరాలను పిటిషన్‌ తరఫు న్యాయవాదులకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ పిటిషన్‌ సవరణకు న్యాయవాది ప్రభాకర్​ అనుమతి కోరగా... తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.

ఇదీ చూడండి:కల్నన్ సంతోశ్ చివరి క్షణాల్లో మనసులో రాసుకున్న ప్రేమలేఖ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.