అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీపీల నియామక ప్రక్రియలో జాప్యంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఏపీపీల నియామక ప్రక్రియకు ప్రభుత్వం 18 వారాల గడువు కోరింది. మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పటివరకు ఏం చేశారని హైకోర్టు ప్రశ్నించింది.
నియామక ప్రక్రియ నత్తనడకన సాగుతోందని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏపీపీల కొరత వల్ల కేసుల విచారణ ముందుకు సాగడం లేదని... అక్టోబరు 31లోగా ఏపీపీ నియామక పరీక్ష ఫలితాల వెల్లడించాలని ఆదేశించింది.
ఇదీ చూడండి: Review Petition in High court: 'నిమజ్జనం ఆంక్షలు సడలించండి... 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తాం'