రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి పార్థసారథి నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రభుత్వం సిఫార్సు చేసిన వ్యక్తిని గవర్నర్ నియమించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ న్యాయవాది పి.సత్యనారాయణ పిల్ దాఖలు చేశారు.
ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు అక్రమాలకు పాల్పడినప్పటికీ.. ఎస్ఈసీ నిరోధించ లేకపోయిందని... ఎన్నికలను రద్దు చేయాలని కోరారు. జీహెచ్ఎంసీ మేయర్‌ను మహిళకు రిజర్వేషన్ చేయడం చట్టవిరుద్ధమని.. ను జరపకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోరారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీని ఆదేశిస్తూ.. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: డ్రగ్స్ కేసుపై హైకోర్టు విచారణ 2వారాలకు వాయిదా