ETV Bharat / state

మంత్రి కొప్పుల ఈశ్వర్​ ఎన్నిక వివాదం - పిటిషన్​ను కొట్టివేసిన హైకోర్టు - కొప్పుల ఈశ్వర్​ వర్సెస్​ అట్లూరి లక్ష్మణ్​

Telangana High Court Dismissed Koppula Eshwar Election Case : మంత్రి కొప్పుల ఈశ్వర్​ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్​ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ధర్మపురి నుంచి ఆయన 2018 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అయితే దీనిపై సవాల్​ చేస్తూ కాంగ్రెస్​ అభ్యర్థి లక్ష్మణ్​ రీకౌంటింగ్​ నిర్వహించాలని కోరారు.

Telangana High Court
Telangana High Court Dismissed Koppula Eshwar Election Case
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 1, 2023, 9:19 PM IST

Telangana High Court dismissed Koppula Eshwar Election Dispute Case : మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ధర్మపురి నుంచి కొప్పుల ఈశ్వర్ 2018 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ(Telangana Election 2018)తో గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన లక్ష్మణ్ రీ కౌంటింగ్ నిర్వహించాలని ఎన్నికల అధికారులను కోరారు. రీ కౌంటింగ్​లోనూ కొప్పుల ఈశ్వర్ గెలిచినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

దీంతో లక్ష్మణ్ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించారు. రీకౌంటింగ్‌లో ఎన్నికల అధికారులు సరైన ప్రమాణాలు పాటించలేదని కొప్పుల ఈశ్వర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. ఆ తర్వాత తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని లక్ష్మణ్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై ఇరువైపుల వాదోపవాదాలు ఇప్పటికే ముగిశాయి. పిటిషన్‌ను కొట్టేస్తూ హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.

High Court on Dharmapuri Election Dispute : 2018 సాధారణ ఎన్నికల్లో ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్​ ఎన్నిక వివాదంపై గతంలో తెలంగాణ హైకోర్టు విచారణ జరిపి.. స్ట్రాంగ్​ రూం తెరవాలని సూచించింది. ఈసారి కోర్టు స్ట్రాంగ్​ రూం తాళాలు బద్ధలు కొట్టమని జగిత్యాల జిల్లా కలెక్టర్​కు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా రిటర్నింగ్​ అధికారి కోరితే వాహనం, భద్రత ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అవసరమైతే వడ్రంగి, లాక్​స్మిత్​ సహకారం తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్​కు న్యాయస్థానం తెలిపింది. ఆర్వోకు డాక్యుమెంట్లు, సీసీ ఫుటేజ్​ వివరాలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశంతో.. తాళం చెపి సరిపోక స్ట్రాంగ్​ రూం తెరవలేకపోయినట్లు కలెక్టర్​ హైకోర్టుకు తెలిపారు.

హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్​కు చుక్కెదురు.. ఏ కేసులో అంటే..?

అయితే స్ట్రాంగ్​ రూం తాళాలు ఎక్కడో పోయాయని అధికారులు తెలిపారు. మళ్లీ ధర్మపురి కాంగ్రెస్​ అభ్యర్థి అట్లూరి లక్ష్మణ్​ మళ్లీ హైకోర్టులో పిటిషన్​ వేశారు. అంతకు ముందు కొప్పుల ఈశ్వర్​ తనపై ఉద్దేశ్యపూర్వకంగానే కేసు వేశారని ఆ పిటిషన్​ను కొట్టివేయాలని హైకోర్టులో మరలా పిటిషన్​ దాఖలు చేశారు. కొప్పుల ఈశ్వర్​ దాఖలు చేసిన పిటిషన్​ను కొట్టేసి.. విచారణ జరపాలని కోరింది. దీనిపై విచారణ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.

Koppula Eshwar Election Controversy 2023 : ఈ నేపథ్యంలోనే ఈసీ విచారణకు గతంలో ఎన్నికల్లో పాల్గొన్న అధికారులు హాజరయ్యారు. ఆ రోజు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏం జరిగింది..? తాళం చెవులు ఎలా మాయమైపోయాయి..? దీనికి బాధ్యులు ఎవరనే కోణంలో విచారణ సాగింది. దీనికి జగిత్యాల, సంగారెడ్డి, మహబూబ్​నగర్​ కలెక్టర్లు షేక్ యాస్మిన్ బాషా, డాక్టర్ శరత్, గుగులోతు రవిలు హాజరయ్యారు. వీరితో పాటు కుమురం భీం జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం.. మరో 40 మంది సిబ్బందిని అధికారులు విచారించారు. అనంతరం సేకరించిన సమాచారాన్ని కోర్టుకు నివేదించనున్నారు. అయితే ఇప్పుడు మాత్రం మంత్రి కొప్పుల ఈశ్వర్​ పిటిషన్​ను కొట్టి వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

High Court: స్ట్రాంగ్ రూం తాళాలు పగలగొట్టేందుకు హైకోర్టు అనుమతి

EC inquiry: 'ధర్మపురి' ఎన్నికల వివాదం.. రంగంలోకి దిగిన కేంద్ర ఎన్నికల కమిషన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.