ETV Bharat / state

సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Telangana HC Green signal To Singareni Elections 2024 : సింగరేణి ఎన్నికలకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాయిదా వేయాలన్న ప్రభుత్వ అభ్యర్థునను హైకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికలను వాయిదా వేసుకుంటూ వస్తున్న హైకోర్టు డిసెంబరు 27న నిర్వహించాలని తెలిపింది.

Singareni Elections
High Court Green signal to Singareni Elections
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 21, 2023, 12:11 PM IST

Updated : Dec 21, 2023, 2:59 PM IST

High Court Green signal to Singareni Elections : సింగరేణి ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. ఈనెల 27వ తేదీన యథావిథిగా సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎలక్షన్ వాయిదా వేయాలన్న ప్రభుత్వ అభ్యర్థన హైకోర్టు తోసిపుచ్చింది. మరోవైపు ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి (Singareni Elections) యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్​ను కూడా హైకోర్టు తోసిపుచ్చింది.

Singareni Elections Postponed : ఈ నెల 28న జరగాల్సిన సింగరేణి ఎన్నికలు వాయిదా..

సింగరేణి ఎన్నికలను నిర్దేశించిన తేదీనే నిర్వహించాలని సింగరేణి యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వచ్చే మార్చి వరకు వాయిదా వేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటీషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఇది వరకు నిర్ణయించినట్లు ఈ నెల 27వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని, అదే రోజు ఫలితాలను కూడా వెల్లడించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Singareni Petition in High Court on Elections : కొత్త ప్రభుత్వం ఏర్పడి కొన్ని రోజులే అయిందని, ఉన్నతాధికారుల బదిలీలకు ప్రాధాన్యం ఇస్తున్నందున సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు గడువు కావాలని ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజినీకాంత్‌ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. 27వ తేదీన నిర్వహిస్తామని ఇది వరకు చెప్పారు కదా అని హైకోర్టు ఏఏజీని ప్రశ్నించింది. ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.

Central Govt Petition on Singareni Elections : సింగరేణి ఎన్నికలపై మరో ట్విస్ట్​.. హైకోర్టును ఆశ్రయించిన కేంద్ర కార్మికశాఖ

సింగరేణిలో జరిగే ఎన్నికల షెడ్యూల్ విడుదలను కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, అవి అయిపోయిన తర్వాత సింగరేణిలో ఎన్నికలు ఏర్పాటు చేయాలని సంస్థలోని 13 యూనియన్లు లిఖితపూర్వకంగా ఎన్నికల అధికారి శ్రీనివాసును కోరాయి. దీంతో పాటు ఎన్నికల్లో గెలిచిన సంఘం కాలపరిమితిని, గత ఒప్పందాల అమలు తదితర విషయాలపై స్పష్టత ఇవ్వాలని సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.

Singareni Elections Schedule Telangana 2023 : సింగరేణిలో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 28న పోలింగ్

High Court To Government on Singareni Elections : ఎన్నికలు నిర్వహించేందుకు మరికొంత సమయం కావాలంటూ ప్రభుత్వ న్యాయవాది ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. డిసెంబరు 27కు బదులు మార్చిలో ఎలక్షన్స్ నిర్వహిస్తామని కోర్టుకు వివరించారు. దీనిపై ఎన్నికల ఫలితాలతో సంబంధాలకు లేకుండా ఎలక్షన్స్ నిర్వహిస్తామనని గతంలో చెప్పారని హైకోర్ట తెలిపింది. కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించి. ఈ మేరకు ఈనెల 21కి విచారణ వాయిదా వేసింది.

Last Updated : Dec 21, 2023, 2:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.