ETV Bharat / state

తెలంగాణ గ్రూప్- 2 పరీక్షల తేదీలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ - Telangana Group 2 Exams

Telangana Group 2 Exams: తెలంగాణ గ్రూప్​-2కు సంబంధించి పరీక్షల తేదీలను టీఎస్​పీఎస్సీ ఖరారు చేసింది. ఇప్పటికే గ్రూప్​-1, గ్రూప్​-4 పరీక్షల తేదీలను విడుదల చేసిన టీఎస్​పీఎస్పీ.. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్​-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Feb 28, 2023, 7:17 PM IST

Updated : Feb 28, 2023, 8:10 PM IST

Telangana Group 2 Exams: గ్రూప్-2 నియామకాల కోసం ఆగస్టు నెలలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షా తేదీలు ప్రకటించింది. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. 783 పోస్టుల భర్తీ కోసం డిసెంబర్ 29న గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేశారు. ఇప్పటికే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను జూన్ 5 నుంచి 10 తేదీ వరకు నిర్వహించనన్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.

గ్రూప్-4 పరీక్షలను జూలై 1న నిర్వహించనున్నారు. దీంతో గ్రూప్-2 పరీక్షలను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. మొత్తం 600 మార్కులకు నాలుగు పేపర్లలో ఆబ్జెక్టివ్ విధానంలో గ్రూప్-2 పరీక్షలు జరుగుతాయి. జనరల్ స్టడీస్, ఎబిలిటీస్ మొదటి పేపర్ కాగా.. హిస్టరీ, పాలిటీ, సొసైటీ రెండో పేపర్‌గా ఉండనుంది. ఎకానమీ అండ్ డెవలప్​మెంట్​ మూడో పేపర్, తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ నాలుగో పేపర్‌గా ఉంటాయి. 783 గ్రూప్-2 పోస్టుల కోసం 5లక్షల 51వేల 943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఒక్కోపోస్టుకు సగటున 705 మంది పోటిపడుతున్నారు.

Group 1 Mains Exam Dates: ఇప్పటికే గ్రూప్​-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ప్రకటించిన టీఎస్​పీఎస్సీ.. జూన్ 5 నుంచి 12 వరకు జరగనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. జూన్ 5న జనరల్ ఇంగ్లీష్, 6న పేపర్-1 జనరల్ ఎస్సే, 7న పేపర్‌-2 చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ, 8న పేపర్-3 భారత సమాజం, రాజ్యాంగం, పాలన, 9న ఎకానమీ, డెవలప్‌మెంట్, 10న సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా సైన్స్, 12న తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్బావం పరీక్షలు నిర్వహించాలని టీఎస్​పీఎస్సీ నిర్ణయించింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు జరగున్నాయి.

Group 4 applications in Telangan: మరోవైపు గ్రూప్-4 పరీక్షకు నిరుద్యోగులు నుంచి భారీ స్పందన లభించింది. మొత్తం 8వేల 180 పోస్టులను విడుదల చేయగా.. 9లక్షల 51వేల 321మంది దరఖాస్తు చేసుకున్నారు. సగటున ఒక్కోపోస్టుకు 116 మంది చొప్పున అభ్యర్థులు పోటీపడుతున్నారు. గ్రూప్​-3కు సంబంధించి ఇప్పటికే సిలబస్​ను విడుదల చేసిన కమీషన్​ పరీక్షల తేదీలు మాత్రం ఇంకా విడుదల చేయలేదు.

ఇవీ చదవండి:

లాసెట్, పీజీఎల్‌ సెట్‌ షెడ్యూల్‌ విడుదల.. దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే..!

ప్రీతి మృతిపై గవర్నర్ సీరియస్​.. సమగ్ర విచారణ జరపాలని యూనివర్సిటీ వీసీకి లేఖ

ఎస్సై రాత పరీక్ష ఫలితాలు విడుదల.. ఎంత మంది ఉత్తీర్ణత సాధించారంటే..?

Last Updated : Feb 28, 2023, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.