ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సీబీఐకి అప్పగింతపై సుప్రీంలో సవాల్

MLAs poaching case in Supreme Court : ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగింతపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేసింది. సీజేఐ ధర్మాసనం ముందు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే ప్రస్తావించారు.

MLAs purchase case in Supreme Court
MLAs purchase case in Supreme Court
author img

By

Published : Feb 8, 2023, 7:01 AM IST

ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్‌

MLAs poaching case in Supreme Court : ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్ నరసింహా, జస్టిస్‌ జేబీ పర్డీవాలా ధర్మాసనం ముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే ఈ కేసును మెన్షన్‌ చేశారు. ఒకవేళ ఈ కేసులో సీబీఐ ప్రవేశిస్తే ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు అంతా దెబ్బతింటుందని ధర్మాసనానికి విన్నవించారు.

TS Govt petition in SC on MLAs bribing case : దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ స్పందిస్తూ.. ఈ కేసును నేడు మెన్షన్‌ చేయాలని సూచించారు. ఒకవేళ మీరు మెన్షన్‌ చేయకపోయినా అది వచ్చే వారం విచారణకు వస్తుందని పేర్కొన్నారు. డిసెంబరు 26న ఇచ్చిన తీర్పు అమలును కనీసం వారం రోజులైనా నిలిపివేయాలంటూ హైకోర్టును ప్రభుత్వం అభ్యర్థించింది. కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన అప్పీళ్లు విచారణార్హం కావని డివిజన్‌ బెంచ్‌ సోమవారం తీర్పు చెప్పింది.

ఈ నేపథ్యంలో సింగిల్‌ జడ్జి వద్ద రాజేంద్రనగర్‌ ఏసీపీ.. బి.గంగాధర్‌ మంగళవారం అత్యవసరంగా విచారణ చేపట్టాలంటూ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తీర్పు అమలును మూడు వారాలపాటు నిలిపివేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌ రెడ్డి మధ్యాహ్నం విచారణ చేపట్టారు. అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. అప్పీళ్లను డివిజన్‌ బెంచ్‌ కొట్టివేసిన వెంటనే తమకు ఫైళ్లు అప్పగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ లేఖ రాశారన్నారు.

దీన్నిబట్టి సీబీఐ అత్యుత్సాహాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు. బీజేపీ, నిందితుల తరఫు సీనియర్‌ న్యాయవాదులు జే ప్రభాకర్‌, ఎల్ రవిచందర్‌, మయూర్‌ రెడ్డిలు వాదనలు వినిపిస్తూ.. విచారణార్హం లేదని అప్పీళ్లను కొట్టివేసిన తర్వాత తిరిగి సింగిల్‌ జడ్జి వద్దకు రావడం సరికాదన్నారు. కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ జీ ప్రవీణ్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. డివిజన్‌ బెంచ్‌ మౌఖిక సూచనల మేరకు ఇప్పటివరకు ఫైళ్లను సీబీఐ స్వాధీనం చేసుకోలేదన్నారు.

వాదనలను విన్న న్యాయమూర్తి.. విలీన సిద్ధాంతం ప్రకారం సింగిల్‌ జడ్జి తీర్పుపై అప్పీలు దాఖలు చేసినపుడు అది ఒకే కేసు అవుతుందని, అలాంటప్పుడు తిరిగి సింగిల్‌ జడ్జి వద్ద ఎలా దరఖాస్తు చేయవచ్చని ప్రశ్నించారు. సాంకేతికపరమైన ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తిని అడిగి చెప్పాలని ఏజీ సూచిస్తూ విచారణను నేటికి వాయిదా వేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.