ETV Bharat / state

Telangana Govt for students: స్వస్థలాలకు విద్యార్థుల తరలింపు.. టికెట్లు బుక్ చేసిన ప్రభుత్వం - దిల్లీ నుంచి హైదరాబాద్

Telangana Govt for students: ఉక్రెయిన్ నుంచి భారత్​ చేరుకున్న తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. విమానాల్లో దిల్లీ, ముంబయికి వచ్చిన వారిని హైదరాబాద్​ తీసుకొచ్చేందుకు టికెట్లను కొనుగోలు చేసింది. వారికి ఎలాంటి ఖర్చులు లేకుండా ఉచితంగానే సొంతూళ్లకు తరలిస్తోంది.

Telangana Govt for students
స్వస్థలాలకు విద్యార్థుల తరలింపు
author img

By

Published : Mar 1, 2022, 10:40 PM IST

Telangana Govt for students: భారతప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్​ గంగలో భాగంగా స్వదేశం చేరుకున్న తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకుంటోంది. ఉక్రెయిన్ నుంచి విమానాల్లో దిల్లీ, ముంబయి చేరుకున్న విద్యార్థులను హైదరాబాద్​ తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. వారికి అవసరమైన విమాన టికెట్లను ప్రభుత్వమే కొనుగోలు చేసి అందజేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఇప్పటికే ఫిబ్రవరి 26వ తేదీన బుచారెస్ట్-ముంబయికి 15 మంది, 27న బుచారెస్ట్-దిల్లీ 16మంది, బుచారెస్ట్-దిల్లీ 9మంది, 28న బుచారెస్ట్-దిల్లీ 14 మంది, మార్చి 1వ తేదీన బుచారెస్ట్-ముంబయికి ఇద్దరు, బుచారెస్ట్- దిల్లీకి 11మంది తెలంగాణ వాసులు స్వదేశానికి తిరిగివచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ వాసులకు దిల్లీ, ముంబయి విమానాశ్రయాల నుంచి తరలించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.