ETV Bharat / state

మరోసారి మానవత్వం చాటుకున్న గవర్నర్​.. యువకుడికి ప్రాథమిక చికిత్స - Tamilisai treated an Injured Young man

Tamilisai treated an Injured Young man : రాష్ట్ర గవర్నర్ తమిళిసై మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇది వరకే విమాన ప్రయాణంలో తోటి ప్రయాణికుడు అస్వస్థతకు గురైనప్పుడు ప్రాథమిక చికిత్స చేసి ప్రాణాలు కాపాడిన ఆమె.. తాజాగా పుదుచ్చేరి నుంచి హైదరాబాద్​కు వస్తున్నప్పుడు చెన్నై సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై సాయం కోసం ఎదురుచూస్తున్న ఓ యువకుణ్ని గమనించారు. వెంటనే ఆమె కారు దిగి అతనికి ప్రాథమిక చికిత్స చేసి.. మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Telangana Governor Tamilisai
Telangana Governor Tamilisai
author img

By

Published : Nov 5, 2022, 8:09 AM IST

Updated : Nov 5, 2022, 8:40 AM IST

Tamilisai treated an Injured Young man : గవర్నర్ తమిళిసై మరో సారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. పుదుచ్చేరి నుంచి హైదరాబాద్​కు ఆమె వస్తుండగా చెన్నై సమీపంలో ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది గమనించిన ఆమె కారును ఆపి అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అంబులెన్స్​కి ఫోన్​ చేసి అక్కడికి పిలిపించారు. ఆస్పత్రి వారితో గవర్నర్​ మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. అనంతరం గవర్నర్‌ తమిళిసై హైదరాబాద్‌కు చేరుకున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వారిని వీలైనంత త్వరగా ఆస్పత్రికి తరలించగలిగితే ప్రాణాలు నిలబెట్టినవారిమవుతామని గవర్నర్‌ సూచించారు.

ఇటు తెలంగాణ గవర్నర్​గానే కాకుండా అటు పుదుచ్చేరి లెఫ్ట్​నెంట్ గవర్నర్​గా తన బాధ్యలు కొనసాగిస్తూ.. ఎప్పుడు సామాజిక అంశాల్లో ముందుంటారు తమిళిసై. డాక్టర్​ వృత్తిపట్ల ఆమెకు ఉన్న అనుభవంతో ఎక్కడికి వెళ్లినా తోటి ప్రయాణికులు అస్వస్థతకు గురైనప్పుడు చికిత్స చేయడానికి ముందుకొస్తారు. అంతే కాకుండా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఆమె తన హోదానే మరిచి క్షేత్ర స్థాయిలో పర్యటించి బాధితులకు సాయం చేయడానికి చూస్తారు.

  • Enroute #Chennai from #Puducherry, immediately stoped my car on seeing a seriously injured road accident victim.
    Gave first aid & made arrangements for hospitalization, spoke to hospital authorities for necessary treatment.

    - Timely help for road accident victims saves lives. pic.twitter.com/l2u9wsiCyh

    — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) November 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

Last Updated : Nov 5, 2022, 8:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.