ప్రభుత్వానికి, ప్రజలకు సదా సంధానకర్తగా ఉంటానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. రాజ్‌భవన్‌ను ప్రజాసమస్యలకు.. వాటి పరిష్కారాలకు వంతెనగా వ్యవహరించేలా చూస్తానన్నారు.
గాంధీ జయంతి సందర్భంగా రాజ్‌భవన్‌లో ఈ-ఆఫీస్‌ను గవర్నర్ ప్రారంభించారు. అనంతరం దృశ్యమాధ్యమంలో సంభాషించారు.
డిజిటలైజేషన్లో భాగంగా ప్రారంభించిన ఈ-ఆఫీస్ కాగిత రహిత, పర్యావరణహిత కార్యాలయంగా పనిచేస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. రాజ్‌భవన్ కార్యక్రమాలు, ఇతరత్రా పనులను సురక్షితంగా, వేగంగా జరిగేందుకు దోహదపడుతుందని గవర్నర్ తెలిపారు.
రాజ్‌భవన్‌లో తనను కలిసిన సీఎం కేసీఆర్.. రాజ్‌భవన్‌లో ఈ-ఆఫీస్‌ను తీసుకురావటాన్ని స్వాగతించినట్లు తెలిపారు. సౌందరరాజన్‌కు ధన్వంతరి అవార్డుకు ఎంపికవ్వటం పట్ల శుభాకాంక్షలు తెలియజేశారన్నారు.
కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లును తాను స్వాగతిస్తున్నానని.. ఇది ఫార్మర్ ఫ్రెండ్లీ, రైతులకు లాభించేలా ఉందని గవర్నర్ అన్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో తెలుగులో మాట్లాడతానని.. అందుకు తగ్గ కసరత్తు చేస్తున్నానని గవర్నర్ తెలిపారు.
ఇవీచూడండి: 'కేంద్రం తెస్తున్న వ్యవసాయ చట్టంతో రైతులకు గడ్డు కాలమే...'