ETV Bharat / state

ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం ల్యాబ్​లు పెంచుతున్నాం: ప్రభుత్వం

కరోనా పరిస్థితులపై, కరోనా నిబంధనలపై ప్రభుత్వం హైకోర్టులో నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచేందుకు మరిన్ని ల్యాబ్​లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. నిబంధనలు అతిక్రమించే వారిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గుర్తిస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.

telangana-government-submit-report-on-corona-to-high-court
ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం ల్యాబ్​లు పెంచుతున్నాం: ప్రభుత్వం
author img

By

Published : Apr 19, 2021, 12:58 PM IST

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నివేదికలో పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 273 మైక్రో కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశామని వెల్లడించింది. ప్రస్తుతం 17 ఆర్టీపీసీఆర్​ ల్యాబ్​లతో పాటు మరో 14 ల్యాబ్​ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని... రెండు వారాల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా 33 రాపిడ్ రెస్పాన్స్ బృందాలు

విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేస్తున్నామని ప్రభుత్వం నివేదికలో పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి 14 వరకు 94,910 మందికి పరీక్షలు నిర్వహించగా... 681 మందికి పాజిటివ్ వచ్చినట్లు స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 33 రాపిడ్ రెస్పాన్స్ బృందాలు ఏర్పాటు చేశామని వెల్లడించింది.

నిబంధనలపై నివేదిక

కొవిడ్ నిబంధనల ఉల్లంఘనులపై డీజీపీ మహేందర్ రెడ్డి నివేదిక సమర్పించారు. మాస్కులు ధరించని 57,907 మందిపై 15 రోజుల్లో కేసులు నమోదు చేశామని వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా గుమిగూడిన 159 మంది అరెస్టు చేశామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిబంధనల అతిక్రమించే వారిని గుర్తిస్తున్నామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: 'పబ్​లు, మద్యం దుకాణాలే ముఖ్యమా? ప్రజల ప్రాణాలు కాదా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.