బియ్యం రాయితీకి తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికానికి సంబంధించి రూ.1,143.45 కోట్లను విడుదల చేసింది. ప్రజాపంపిణీ వ్యవస్థ బియ్యం కొనుగోళ్లు, రాయితీ కోసం 2020-21 ఆర్థిక సంవత్సం బడ్జెట్లో రూ.2,286.90 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
ఈ ఆర్థిక సంవత్సంలో ఇప్పటివరకు మొత్తం రూ.1,143.45 కోట్లు విడుదల చేయగా.. మిగిలిన సగం మొత్తాన్ని తెలంగాణ సర్కార్ ఇవాళ విడుదల చేసింది. ఈ మేరకు నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండిః ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం చేసి ప్లాట్లుగా మార్చేస్తున్నారు!