ETV Bharat / state

మాస్క్ లేకపోతే రూ. 1000 జరిమానా... ఉత్తర్వులు జారీ - లాక్‌డౌన్‌ సడలింపు

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగింపు, సడలింపులపై ప్రభుత్వం స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జోన్లు, ప్రాంతాల వారిగా అనుమతులిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

లాక్‌డౌన్‌ కొనసాగింపు, సడలింపులపై జీఓ జారీ

author img

By

Published : May 7, 2020, 10:52 PM IST

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగింపు, సడలింపులపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుండా తిరిగితే రూ. 1000 జరిమానా విధించనున్నట్లు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని రకాల నిర్మాణ పనులకు అనుమతులు ఇస్తున్నట్లు జీఓలో పేర్కొంది. జీహెచ్ఎంసీ పరిధిలో సైట్‌ వద్ద ఉండే కార్మికులతో నిర్మాణ పనులకు అనుమతి ఇచ్చింది.

అక్కడ మాల్స్ మినహా అన్ని అన్ని దుకాణాలకు...

గ్రామీణ ప్రాంతాలు, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని రకాల పరిశ్రమలకు సైతం అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. మాల్స్ మినహా గ్రామీణ ప్రాంతాల్లో, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్ని దుకాణాలకు అనుమతి లభించింది. జీహెచ్ఎంసీ, రెడ్ జోన్లలో పక్కపక్కన ఉండే దుకాణాలు, వేర్వేరు రోజుల్లో తెరిచేలా ఆదేశాలు జారీ చేసింది.

33 శాతం సిబ్బందితో పనిచేసుకోవచ్చు...

జీహెచ్ఎంసీ, రెడ్ జోన్లలో నిర్మాణ రంగ, వ్యవసాయ సంబంధిత దుకాణాలకు అనుమతిస్తున్నామని వివరించారు. గ్రీన్, ఆరెంజ్ జోన్‌ల్లో ఈ-కామర్స్ విధానంలో అన్ని రకాల వస్తువుల సరఫరాకు అనుమతులు మంజూరయ్యాయి. జీహెచ్ఎంసీ, రెడ్ జోన్​లో ప్రైవేట్ కార్యాలయాలు, ఐటీ సంబంధ కార్యాలయాలు 33 శాతం సిబ్బందితో పనిచేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పొందుపరిచింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ప్రైవేట్ కార్యాలయాల పూర్తి స్థాయి కార్యకలాపాలకూ అనుమతులు మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఇవీ చూడండి : కొండపోచమ్మ నిర్వాసితులకు తాత్కాలిక నివాసాలివ్వండి : హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.