ETV Bharat / state

TS Government: ఆర్డర్‌ టు సర్వ్‌ ఉద్యోగులపై.. ప్రభుత్వం దృష్టి - తెలంగాణ వార్తలు

కొత్త జోనల్ విధానం అమలు కావడంతో ఉద్యోగుల పునఃకేటాయింపుల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియపై మంగళ, బుధ, గురువారాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్ సమీక్షలు నిర్వహిస్తారని వెల్లడించింది.

reassignment-of-employees
కొత్త జోనల్ విధానం
author img

By

Published : Sep 6, 2021, 7:34 AM IST

రాష్ట్రంలో కొత్త జోనల్‌ విధానంలో ఉద్యోగుల విభజన, ఖాళీల నిర్ధారణ పూర్తి కావడంతో ఇక ఆర్డర్‌ టు సర్వ్‌ కింద కొత్త జిల్లాలకు పంపించిన ఉద్యోగుల పునః కేటాయింపులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ విధానంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు, జిల్లా, ఉమ్మడి జిల్లా వివరాల జాబితాను పంపించాలని సూచించింది.

సోమవారం వరకు ఈ వివరాలను పంపించాలంది. ఈ ప్రక్రియపై మంగళ, బుధ, గురువారాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సమీక్షలు నిర్వహిస్తారని తెలిపింది. 2016లో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా ఉమ్మడి జిల్లాల నుంచి ఉద్యోగులను వాటికి పంపించింది. తాజాగా కొత్త జోనల్‌ విధానం అమలు కావడంతో వీరిని సొంత జిల్లాలకు పంపాల్సి ఉంది. దీని కోసం కసరత్తు చేపట్టాలని ప్రభుత్వం నిర్దేశించింది.

ఇదీ చూడండి: KTR: హైదరాబాద్‌కు మరో బయోఫార్మా హబ్‌: మంత్రి కేటీఆర్‌​​​​​​​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.