ETV Bharat / state

good news: పదోన్నతుల అంశంపై ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు

author img

By

Published : Aug 30, 2021, 10:44 PM IST

Updated : Aug 31, 2021, 4:29 AM IST

ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులకు కనీస సర్వీసును రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లకు కుదించింది.

Promotions
Promotions

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల కల్పనకు కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వుల(జీవో నం.259)ను జారీ చేసింది. రాష్ట్ర, సబార్డినేట్‌ సర్వీసులలో కొత్తగా చేరిన వారేగాక ప్రస్తుతం పనిచేస్తున్నవారు పైస్థాయి (ఉన్నత కేటగిరి, గ్రేడ్‌, తరగతి)కి వెళ్లడానికి ఇది వర్తిస్తుందని పేర్కొంది. సోమవారం నుంచే జీవో అమలులోకి వచ్చిందని, పదోన్నతుల సంవత్సరం(ప్యానల్‌ ఇయర్‌)తో సంబంధం లేకుండా తదుపరి నిబంధనలతో ఆదేశాలు జారీ చేసేవరకు ఇది అమల్లో ఉంటుందని వెల్లడించింది. దీనికోసం తెలంగాణ రాష్ట్ర, సబార్డినేట్‌ల సేవా నిబంధనలు-1996ను సవరించినట్లు తెలిపింది. ప్రస్తుతం ఉన్న సేవా నిబంధనల మేరకు ప్రభుత్వోద్యోగుల పదోన్నతులకు కనీస అర్హత మూడేళ్లుగా ఉంది.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఉద్యోగ, అధికారుల సంఘాల వినతి మేరకు సీఎం 2018లో ఈ పరిమితిని రెండేళ్లకు తగ్గించేందుకు అంగీకరించారు. దీనికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ జీవోకు ఏడాది గడువే విధించారు. తర్వాత ఈ ఏడాది ఆరంభంలో ఉద్యోగ సంఘాల వినతి మేరకు గత జనవరి 11న మరోసారి రెండేళ్ల సర్వీసుతోనే పదోన్నతులు కల్పించేందుకు ఉత్తర్వులిచ్చారు. దీనికి ఆగస్టు వరకే గడువు ఇచ్చారు. ఇది ముగుస్తున్నందున మరోసారి ఉద్యోగ సంఘాలు సీఎం కేసీఆర్‌ను కలసి పదోన్నతుల కనీస అర్హతను రెండేళ్లకు కుదిస్తూ గడువుతో సంబంధం లేకుండా వర్తించేలా శాశ్వత ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. దీనికి సీఎం అంగీకరించి, సీఎస్‌కు ఆదేశాలిచ్చారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం తదుపరి ఆదేశాల జారీ వరకు పదోన్నతులకు కనీస సర్వీసు రెండేళ్ల నిబంధననే అమలు చేయాలని ఆదేశించింది.

సీఎంకు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు

పదోన్నతుల ఉత్తర్వుల జారీపై టీజీవో, టీఎన్జీవోల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మమత, రాజేందర్‌, సత్యనారాయణ, ప్రతాప్‌లు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం ఛైర్మన్‌ పద్మాచారి, పీఆర్‌టీయూటీఎస్‌, గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్‌రెడ్డి, కమలాకర్‌రావు, చంద్రశేఖర్‌గౌడ్‌, హన్మంతునాయక్‌లు కూడా సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి: MAHAMOOD ALI: 'ముఖ్యమంత్రి కేసీఆర్​ ఉద్యోగుల పక్షపాతి'

Last Updated : Aug 31, 2021, 4:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.