ETV Bharat / state

మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 9, 2024, 4:47 PM IST

Updated : Jan 9, 2024, 7:37 PM IST

Telangana Government Judicial Inquiry on Medigadda Issue : కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుపై పూర్తిస్థాయి విజిలెన్స్​ విచారణ చేపట్టాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం విచారణను ఇప్పటికే ముమ్మరం చేయగా ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై పది నీటిపారుదలశాఖ కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు సోదాలు చేపట్టాయి. పలు కీలకదస్త్రాలు, రికార్డులను స్వాధీనం చేసుకున్నాయి. ప్రాజెక్టు నష్టానికి గల కారణాలపై ఆరా తీస్తున్నాయి.

Kaleshwaram Project Issue Update
Judicial Inquiry on Medigadda Issue

Telangana Government Judicial Inquiry on Medigadda Issue : కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై రాష్ట్రప్రభుత్వం విచారణను ముమ్మరం చేసింది. ప్రాజెక్టుకు జరిగిన నష్టానికి గల కారణాలను ఆరా తీస్తోంది. అందులో భాగంగానే మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి (Uttam Kumar Reddy)ఉత్తర్వులు జారీ చేశారు. పది నీటిపారుదల కార్యాలయాల్లో విజిలెన్స్ తనిఖీలు చేయాలని ఆదేశించారు. మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తామన్నారు.

కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల కార్యాలయాల్లో విజిలెన్స్​ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ బృందాల సోదాలు
Inquiry on Medigadda Barrage Issue : మేడిగడ్డ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణపై కేబినెట్‌లోనూ తీర్మానం చేశామన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పూర్తి సమాచారంతో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌(Power Point Presentation on Medigadda Barrage)ను అధికారుల ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మరోవైపు ఉదయం నుంచి కాళేశ్వరం, మేడిగడ్డకు సంబంధిచి రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, కన్నెపల్లి, సిరిపురం, గోలివాడ పంపు హౌజ్‌లకు సంబంధించిన రికార్డులను పరిశీలించేందుకు విజిలెన్స్ బృందాలను రంగంలోకి దించింది. ప్రాజెక్టు పరిధిలో 10 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కోసం ప్రత్యేకంగా నియమించినట్లు సమాచారం.

మేడిగడ్డ బ్యారేజీ ఘటన - 'ఆ మూడు పియర్స్ కుంగుబాటుతో ఆనకట్ట మొత్తం కదిలింది'

ED Rides on Irrigation Deportment Offices in Telangana : మేడిగడ్డ ఆనకట్ట కుంగిన నేపథ్యంలో హైదరాబాద్‌ ఎర్రమంజిల్ జలసౌధలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కాళేశ్వరం కార్పొరేషన్ కార్యాలయంలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల కార్యాలయాల్లో పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలపై దృష్టి సారిస్తూ తనిఖీలు చేపట్టినట్లుగా సమాచారం. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని రామగుండం, మహదేవపూర్, మేడిగడ్డ, ఎల్​ఎండీతో పాటు ప్రాజెక్టకు సంబంధించిన ప్రత్యేక కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్​టీపీసీలోని(ED on Ramagundam NTPC) ఈఎన్సీ, ఎస్ఈ, క్వాలిటీ కంట్రోల్ కార్యాలయాల్లోనూ బృందాలు రికార్డులను పరిశీలించాయి. పలు ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్‌ అదనపు ఎస్పీ బాలకోటయ్య వెల్లడించారు.

మేడిగడ్డ, అన్నారం పునరుద్ధరణపై చేతులెత్తేసిన సీడీవో

Inquiry on Kaleshwaram Project Corruption : మేడిగడ్డ బ్యారేజీ, కన్నేపల్లి పంప్ హౌస్‌లకు సంబంధించిన కార్యాలయాల్లో అధికారుల బృందాలు ముమ్మర తనిఖీలు నిర్వహించాయి. మహాదేవపూర్ సాగునీటి శాఖ డివిజన్ కార్యాలయం, కన్నేపల్లి పంప్ హౌస్ కార్యాలయాల్లో రికార్డులను విలువైన పత్రాలను అధికారుల బృందాలు పరిశీలించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి మహదేవ్ పూర్, కన్నపెల్లి పంప్ హౌజ్ కార్యాలయల్లో సోదాలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని రూ.లక్ష కోట్ల మేర కుంభకోణం జరిగిందని మొదటి నుంచి ఆరోపిస్తున్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రాజెక్టుపై సమగ్రంగా సమీక్ష చేపట్టింది. ప్రాజెక్టులో జరిగిన అవినీతి నిగ్గు తేల్చేందుకు న్యాయవిచారణకు ఆదేశించింది. మరోవైపు విజిలెన్స్ తనిఖీలు కలకలం రేపుతున్నాయి. ప్రాజెక్టులో జరిగిన నష్టానికి గల కారణాలను నిపుణులతో పూర్తిస్థాయిలో విశ్లేషించి ఆ నివేదికను అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనున్నారు.

బ్యారేజీ కుంగటానికి కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టేది లేదు : ఉత్తమ్‌

Last Updated : Jan 9, 2024, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.